Sperm Count: అబ్బాయిలూ జాగ్రత్త.. ఇలా బట్టలు వేసుకుంటే స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందట

Can Wearing Tight Clothes Affect Sperm Count?

Can Wearing Tight Clothes Affect Sperm Count?

Sperm Count: ఇప్పటి ఫ్యాషన్ ప్రపంచంలో బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం ఓ ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా యూత్‌కి స్టైలిష్‌గా కనిపించాలనే ఆలోచనతో టైట్ జీన్స్, లోదుస్తులు వేసుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. అయితే, ఇవి బయటకు స్టైలిష్‌గా కనిపించినా… మన శరీరంపై, ముఖ్యంగా పురుషుల ఆరోగ్యంపై దీర్ఘకాలంలో ఏమాత్రం ప్రభావం చూపవచ్చో ఎప్పుడైనా ఆలోచించారా?

తాజా వైద్య అధ్యయనాల ప్రకారం, బిగుతుగా ఉండే దుస్తులు ముఖ్యంగా వృషణాల చుట్టూ ఉష్ణోగ్రతను పెంచుతాయని తెలిసింది. వాస్తవానికి, స్పెర్మ్ (వీర్య కణాలు) సరిగ్గా ఎదగాలంటే వృషణాల ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత కంటే కొంచెం తక్కువగా ఉండాలి. కానీ టైట్ లోదుస్తులు, జీన్స్ వంటివి శరీరానికి అతుక్కుపోయి వేడిని బయటకు పోనివ్వవు. దీంతో వృషణాల వద్ద ఉష్ణోగ్రత పెరిగి, స్పెర్మ్ తయారీ ప్రక్రియ మందగిస్తుంది.

సాధారణంగా స్పెర్మ్ చాలా సున్నితమైన కణం. ఇది తగిన ఉష్ణోగ్రతలోనే ఆరోగ్యంగా తయారవుతుంది. అయితే పదే పదే బిగుతుగా ఉండే దుస్తులు ధరించటం వల్ల శరీరంలోని వేడి అంతర్గతంగానే ఉండిపోతుంది. దీని ప్రభావం నెమ్మదిగా స్పెర్మ్ తయారీకి, చివరకు సంతానోత్పత్తి సామర్థ్యానికి కూడా మనస్సులో పెట్టుకోదగ్గ విధంగా ఇబ్బందులు కలిగించవచ్చు.

అందుకే, స్టైల్ పరంగా ఫాలో అవ్వాలనుకున్నా, ఆరోగ్య పరంగా కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. విశ్రాంతిగా, గాలి ప్రసరణ ఉండే దుస్తులు ఎంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Also Read: Andhra: కాఫీ గిన్నె మాడినందుకు అమ్మ తిడ్తదని.. మృత్యు ఒడిలోకి ప్రాణ స్నేహితులు

Sperm Count: అబ్బాయిలూ జాగ్రత్త.. ఇలా బట్టలు వేసుకుంటే స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందట