New Trick: హైవేపై బండి ఆగిపోయిందా? ఇలా చేయండి!

What To Do If Your Car Suddenly Stops On The Road

What To Do If Your Car Suddenly Stops On The Road

New Trick: నేషనల్ హైవేలపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా వాహనం ఆగిపోవడం చాలా మందికి ఎదురయ్యే సమస్య. ముఖ్యంగా పెట్రోల్ లేదా డీజిల్ అయిపోవడం వల్ల మధ్యలోనే నిలిచిపోతే ఆందోళన కలగడం సహజం. అయితే అలాంటి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రత్యేకంగా అత్యవసర సహాయ సేవలను అందిస్తోంది.

హైవేపై ఎక్కడైనా ఇలాంటి ఇబ్బంది ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 1033 కు కాల్ చేయాలి. మీ లొకేషన్ వివరాలు తెలియజేస్తే, కొద్ది నిమిషాల్లోనే హెల్పింగ్ టీమ్ మీ వద్దకు చేరుకుంటుంది. అవసరమైతే డబ్బులు చెల్లించి గరిష్టంగా 5 లీటర్ల వరకు పెట్రోల్ లేదా డీజిల్ అందిస్తారు. దీంతో సమీపంలోని పెట్రోల్ బంక్ వరకు సులభంగా వెళ్లే అవకాశం ఉంటుంది.

ఇంతటితో కాదు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ సేవలు ఉపయోగపడతాయి. వాహనం బ్రేక్‌డౌన్ కావడం, టైర్ పంక్చర్ అవడం, చిన్నపాటి సాంకేతిక సమస్యలు తలెత్తడం వంటి సందర్భాల్లో కూడా సిబ్బంది సహాయం అందిస్తారు. ప్రమాదం జరిగినప్పుడు లేదా వైద్య అత్యవసరం ఉన్నప్పుడు కూడా అవసరమైన మార్గదర్శకత్వం ఇస్తారు.

ఈ సేవలు అన్ని రకాల వాహనాలకు వర్తిస్తాయి. కార్లు, బైకులు, బస్సులు, లారీలు వంటి వాహనాలందరికీ 24 గంటలు, వారంలో 7 రోజులు అందుబాటులో ఉంటాయి.

కాబట్టి హైవేపై ప్రయాణించే ముందు వాహనంలో ఇంధనం సరిపడా ఉందో లేదో చూసుకోవడం మంచిది. అయినప్పటికీ అనుకోకుండా సమస్య ఎదురైతే 1033 నంబర్‌ను గుర్తుంచుకుని వెంటనే సహాయం పొందండి.

Also Read: Menaka Guruswamy: రాజ్యసభ రేసులో LGBTQ.. ఎవరీ మేనకా గురుస్వామి?

New Trick: హైవేపై బండి ఆగిపోయిందా? ఇలా చేయండి!