Healthy Habits: రోజూ ఇలా చేస్తే.. గుట్టలా ఉన్న మీ పొట్ట మాయం

Top Benefits of Ajwain: Digestion, Weight Loss & More

Top Benefits of Ajwain: Digestion, Weight Loss & More

Healthy Habits: వాము ప్రతి ఇంటి వంటగదిలో ఉండే సాధారణ సుగంధ ద్రవ్యం. ఇది వంటకాలకు రుచి, వాసన ఇవ్వడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఆయుర్వేదంలో వాముకు ప్రత్యేక స్థానం ఉంది. వేల సంవత్సరాల క్రితమే అష్టాంగ హృదయంలో మహర్షి వాగ్భటాచార్య వామును “వాత పిత్త నాశకారిణి”గా పేర్కొన్నారు. అంటే ఇది గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆరోగ్య నిపుణుల ప్రకారం, వాములో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, థైమోల్, విటమిన్ C, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

వాము వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

జీర్ణక్రియ మెరుగుదల: పరగడుపున వాము నీరు తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసి, ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.

బరువు తగ్గడం: రాత్రి ఒక చెంచా వామును నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని గోరువెచ్చగా తాగితే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నానిన వామును నమిలి తింటే శరీరంలో కొవ్వు కరిగే ప్రక్రియ వేగవంతమవుతుంది.

నొప్పుల ఉపశమనం: కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గించడంలో వాము ఉపయోగకరం. వాము నూనెతో మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. బహిష్టు నొప్పుల సమయంలో వేయించిన వామును పాలతో తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

జలుబు, తలనొప్పి: వాము పొడిని గుడ్డలో కట్టి వాసన చూస్తే జలుబు, తలనొప్పి తగ్గుతుంది. వాము, ధనియాలు, జీలకర్రతో చేసిన కషాయం జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

దంత ఆరోగ్యం: వామును త్రిఫలాలతో కలిపి దంతాల వద్ద ఉపయోగిస్తే దంత సమస్యలు తగ్గుతాయి. వామును నమిలితే గొంతు నొప్పి కూడా తగ్గుతుంది.

కిడ్నీ రాళ్లు: వామును వివిధ రూపాల్లో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు కరిగేందుకు సహాయపడుతుందని చెబుతారు.

ఆస్తమా: వామును బెల్లంతో కలిపి తీసుకుంటే ఆస్తమా బాధితులకు ఉపశమనం లభిస్తుంది.

గుండె ఆరోగ్యం: వాము గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది.

గర్భిణీలకు: గర్భధారణ సమయంలో వామును పరిమితంగా తీసుకుంటే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

చర్మం, జుట్టు సంరక్షణ: వాము పొడిని పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి. వాము, కరివేపాకు వంటి పదార్థాలతో చేసిన కషాయం జుట్టు ఆరోగ్యానికి ఉపయోగకరం.

దోమల నివారణ: వాము, ఆముద నూనె కలిపి ఇంట్లో రాస్తే దోమలు దూరంగా ఉంటాయి.

వామును నీటిలో, మజ్జిగలో, పాలలో లేదా వంటల్లో కలిపి తీసుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి నానబెట్టిన వాము నీటిని ఉదయం తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Ashna Thampi: అకౌంట్‌లో ₹44, చేతిలో ₹40.. బరిలో 26ఏళ్ల అమ్మాయి!

Healthy Habits: రోజూ ఇలా చేస్తే.. గుట్టలా ఉన్న మీ పొట్ట మాయం