Marriage: పెళ్లి కావట్లేదని బాధపడ్తున్నారా.. ఐతే ఈ పని చేయండి

To remove the marriage defect, perform this puja on Shashti!

To remove the marriage defect, perform this puja on Shashti!

Marriage: ఇటీవలి కాలంలో చాలా మంది కెరీర్, సంపాదనలపై దృష్టి పెట్టి పెళ్లిళ్లను వాయిదా వేస్తున్నారు. 30, 40 ఏళ్లు వచ్చినా కూడా వివాహం చేసుకోకుండా ఉండిపోతున్నారు. తరువాత సంబంధాలు కుదరడం లేదని నిరాశ చెందుతూ, కొందరు డిప్రెషన్‌కు లోనవుతున్నారు. పెద్దలు చెప్పిన మాటలను పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు మరింత పెరుగుతున్నాయి. కొందరు దేవాలయాలకు తిరుగుతూ, వ్రతాలు, హోమాలు చేస్తూ కూడా ఫలితం రాకపోవడంతో బాధపడుతుంటారు.

ఇలాంటి పరిస్థితుల్లో వివాహం కుదరాలని కోరుకునే యువకులు కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు పాటిస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వల్ల వివాహ దోషాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు.

వివాహం ఆలస్యమవుతున్న పురుషులు 41 రోజులపాటు సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు చేయాలి. ప్రతి రోజూ స్వామివారిని భక్తితో పూజించి, తమ చేతులతో నైవేద్యం సిద్ధం చేసి సమర్పించాలి. అలాగే సమీపంలోని ఆలయానికి వెళ్లి 21 ప్రదక్షిణలు చేసి, గోత్ర నామాలతో అర్చన చేయించుకోవాలి. సంకల్పం చెబుతున్నప్పుడు “వివాహ దోష పరిహారార్థం” అని చెప్పి స్వామివారిని ప్రార్థించాలి.

నైవేద్యం కోసం ప్రత్యేకంగా ఏదైనా ఖరీదైన పదార్థాలు అవసరం లేదు. మీ శక్తి మేరకు పాలు, చక్కెర కలిపి సమర్పించినా సరిపోతుంది. లేకపోతే అరటిపండ్లు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి వంటి పదార్థాలతో నైవేద్యం తయారు చేసి సమర్పించవచ్చు. ముఖ్యంగా ఈ నైవేద్యాన్ని భక్తితో స్వయంగా తయారు చేయడం మంచిదని చెబుతున్నారు.

ఆలయ దర్శన సమయంలో “శ్రీవల్లి కళ్యాణం”, “దేవసేన కళ్యాణం” వంటి శ్లోకాలు చదవడం శుభప్రదంగా భావిస్తారు. అదనంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం, షోడశ నామాలు, అష్టకం వంటి స్తోత్రాలు పఠించడం వల్ల మరింత మంచిఫలితాలు కలుగుతాయని అంటున్నారు.

ఈ పూజలను భక్తి, విశ్వాసంతో చేయడం అత్యంత ముఖ్యం. ఫలితాల గురించి ఆందోళన పడకుండా, నమ్మకంతో ఆచరించాలి. ముఖ్యంగా పెళ్లి కావాలని కోరుకునే వారు స్వయంగా ఈ పూజలు చేయడం ఉత్తమం. తల్లిదండ్రులు పిల్లల కోసం చేయడం కంటే, వారు తామే చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా చేయవచ్చని సూచిస్తున్నారు.

Also Read: Kidney Health: ఈ లక్షణాలుంటే.. మీ కిడ్నీ డేంజర్ లో ఉన్నట్టే..!!

Marriage: పెళ్లి కావట్లేదని బాధపడ్తున్నారా.. ఐతే ఈ పని చేయండి