Amavasya: అమావాస్య రోజు ఈ పనులు అస్సలు చేయకండి

Things You Should Avoid on Amavasya

Things You Should Avoid on Amavasya

Amavasya: హిందూ సంప్రదాయంలో అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఈ రోజున పూజలు, పరిహారాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అయితే అదే సమయంలో కొన్ని పనులు మాత్రం చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. ఆ నియమాలను పాటించకపోతే ప్రతికూల ప్రభావాలు కలగవచ్చని చెబుతున్నారు.

ముఖ్యంగా అమావాస్య రోజున మాంసాహారం తినడం, మద్యం సేవించడం నివారించాలి. ఇవి అశుభంగా భావించబడతాయి. మాంసాహారం తీసుకుంటే కుండలిపై ప్రతికూల ప్రభావం పెరుగుతుందని నమ్మకం.

అలాగే ఈ రోజున గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం చేయకూడదు. ఇలా చేస్తే పితృదోషం ప్రభావం పడుతుందని చెబుతారు. కొందరు ఈ రోజున తలస్నానం చేయడం కూడా మంచిది కాదని భావిస్తారు.

చీపురు కొనుగోలు కూడా అమావాస్య రోజున చేయకూడదని అంటారు. చీపురు లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉందని నమ్మకం. ఈ రోజున చీపురు కొనడం వల్ల లక్ష్మీదేవి అసంతృప్తి చెందుతుందని, దాంతో ధన ప్రవాహం తగ్గే అవకాశముందని చెబుతారు. అంతేకాకుండా ఇంట్లో ప్రతికూల శక్తులు పెరిగి, ఆరోగ్య ఖర్చులు కూడా పెరిగే అవకాశముందని విశ్వసిస్తారు.

ఇంకా అమావాస్య రోజున తలకు నూనె రాయడం కూడా నివారించాలి. దాని బదులుగా నూనెను దానం చేయడం శ్రేయస్కరం. నూనె శని గ్రహంతో సంబంధం కలిగి ఉండటంతో, దానం చేస్తే శని దోషం తగ్గుతుందని చెబుతారు.

చాలామంది అమావాస్య రోజున పూజలు చేయకూడదని అనుకుంటారు. కానీ పండితుల సూచనల ప్రకారం ఈ రోజున పూజలు, తర్పణాలు, పరిహారాలు చేయడం మంచిదని చెబుతున్నారు. సరైన విధంగా ఆచరించినప్పుడు ఈ రోజు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

Also Read: Treasure: ఇలా చేస్తే గుప్త నిధులు ఎక్కడున్నాయో తెల్సుకోవచ్చు

Amavasya: అమావాస్య రోజు ఈ పనులు అస్సలు చేయకండి