Sleeping Time: రాత్రి పడుకునే ముందు ఈ పనులు కచ్చితంగా చేయాలి

The Best Things You Can Do Before Going to Bed

The Best Things You Can Do Before Going to Bed

Sleeping Time: నిద్ర మన ఆరోగ్యానికే కాదు, మన అందానికి కూడా చాలా కీలకం. రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే ఉదయం కళ్ల కింద నల్లటి వలయాలు, కళ్ల ఉబ్బరం, అలసిన ముఖం కనిపిస్తాయి. అందుకే మంచి నిద్ర కోసం కొన్ని అలవాట్లు పాటించడం అవసరం. పడుకునే ముందు కనీసం గంట పాటు మొబైల్, టీవీ, కంప్యూటర్ వంటి వాటికి దూరంగా ఉండి, సంగీతం వినడం లేదా ధ్యానం చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

స్లీపింగ్ పోశ్చర్:

నిద్రపోయే విధానం కూడా ముఖం మీద ప్రభావం చూపిస్తుంది. వెల్లకిలా పడుకోవడం ఉత్తమం. పక్కగా లేదా బోర్లా పడుకోవడం వల్ల ముఖంపై ఒత్తిడి పెరిగి ముడతలు, యాక్నే వచ్చే అవకాశం ఉంటుంది. బోర్లా పడుకునే వారికి నుదుటిపై గీతలు స్పష్టంగా కనిపించవచ్చు. అందుకే వెల్లకిలా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే దిండు వాడటం కూడా మర్చిపోవద్దు.

మేకప్ తొలగించడం:

పడుకునే ముందు తప్పనిసరిగా మేకప్ తొలగించాలి. రోజంతా పేరుకున్న మురికి, జిడ్డు మేకప్‌తో కలిసి పోర్స్‌లోకి వెళ్లి చర్మ సమస్యలు తెస్తాయి. దీంతో యాక్నే మాత్రమే కాదు, వయసు ప్రభావం కూడా త్వరగా కనిపిస్తుంది.

ఆల్కహాల్ నివారణ:

నిద్రకు ముందు ఆల్కహాల్ తీసుకోవడం మంచిది కాదు. ఇది నిద్రను భంగం చేస్తుంది. అందుకే రాత్రి కార్యక్రమాలు ఉన్నా, నిద్ర సమయానికి 2-3 గంటల ముందే ఆల్కహాల్ తీసుకోవడం ఆపి నీరు తాగడం మంచిది.

బెడ్ షీట్స్, పిల్లో కవర్స్:

శుభ్రత కూడా చాలా ముఖ్యం. వారానికి కనీసం ఒకసారి బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ ఉతకాలి. అవి మురికిగా ఉంటే చర్మ సమస్యలు రావచ్చు. సాధ్యమైతే సిల్క్ పిల్లో కవర్స్ వాడడం మంచిది, ఇవి ముడతలు తగ్గించడంలో సహాయపడతాయి.

రూం టెంపరేచర్:

గది ఉష్ణోగ్రత కూడా నిద్రపై ప్రభావం చూపిస్తుంది. చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉంటే నిద్ర సరిగా పట్టదు. కూల్‌గా, సౌకర్యంగా ఉండే వాతావరణంలో నిద్రపోతే శరీరం సరిగా విశ్రాంతి పొందుతుంది.

నిద్రపోతున్న సమయంలో శరీరం కొత్త కొలాజెన్ తయారు చేసుకోవడం, రక్త ప్రసరణ మెరుగుపరచడం, కళ్ల కింద ఉన్న ఉబ్బరాన్ని తగ్గించడం వంటి ప్రక్రియలు జరుగుతాయి. ఇవన్నీ సరిగ్గా జరగాలంటే రోజుకు 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. మైండ్ రిలాక్స్ అయితేనే శరీరం కూడా విశ్రాంతి పొందుతుంది.

అదేవిధంగా, నైట్ స్కిన్ కేర్ కూడా ముఖ్యమే. మేకప్ తీసిన తర్వాత సరైన క్రీమ్స్, లిప్ బామ్ వాడటం వల్ల చర్మానికి మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంతో పాటు అందం కూడా మెరుగుపడుతుంది.

Also Read: Youtuber Vaishnavi: వైష్ణవి సమాధిని వీడని అన్నలు.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు

Sleeping Time: రాత్రి పడుకునే ముందు ఈ పనులు కచ్చితంగా చేయాలి