Summer Tips: వాహనం తీస్తున్నారా? ఓ సారి చెక్ చేయండి!

Summer vehicle Maintenance Tips

Summer vehicle Maintenance Tips

Summer Tips: వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ వేడి నుంచి తప్పించుకోవడానికి మనుషులే కాదు, మూగజీవాలు కూడా చల్లని చోట్ల ఆశ్రయం తీసుకోవడానికి ప్రయత్నిస్తాయి. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు వంటి జంతువులు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు రోడ్డుపై పార్క్ చేసి ఉన్న వాహనాల కింద తలదాచుకుంటూ ఉంటాయి.

అయితే చాలా మంది వాహనదారులు ఈ విషయాన్ని గమనించకుండా వాహనాన్ని స్టార్ట్ చేసి ముందుకు తీస్తుంటారు. దీంతో వాహనం కింద ఆశ్రయం తీసుకున్న జంతువులు చక్రాల కింద పడిపోయి తీవ్రంగా గాయపడే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో అవి ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి.

ఈ నేపథ్యంలో వాహనదారులు కొంత జాగ్రత్తగా ఉండాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. ముఖ్యంగా వాహనం స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి వాహనం చుట్టూ, కింద భాగంలో ఏమైనా జంతువులు ఉన్నాయా అని పరిశీలించాలని సూచిస్తున్నారు. ఇలా చిన్న జాగ్రత్త తీసుకుంటే మూగజీవాల ప్రాణాలను కాపాడినట్టవుతుందని చెబుతున్నారు.

ఇక వేసవి కాలంలో పక్షులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. అందుకే ఇళ్ల మిద్దెలపై లేదా ఆరుబయట ప్రదేశాల్లో పక్షులు తాగేందుకు నీళ్లు ఉంచాలని జంతు ప్రేమికులు ప్రజలను కోరుతున్నారు. చిన్న పాత్రల్లో నీళ్లు పెట్టడం వల్ల పక్షులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు.

మొత్తంగా వేసవి కాలంలో మనం తీసుకునే చిన్నచిన్న జాగ్రత్తలు మూగజీవాలు, పక్షుల ప్రాణాలను కాపాడటంలో ఎంతో సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Gaddar Film Awards: 2025 గద్దర్ అవార్డులు.. ఉత్తమ చిత్రంగా ‘రాజు వెడ్స్ రాంబాయి’

Summer Tips: వాహనం తీస్తున్నారా? ఓ సారి చెక్ చేయండి!