Numbness in Hands: నిద్రలో చేతులు తిమ్మిర్లు పడుతున్నాయా..?

Numbness in Hands While Sleeping

Numbness in Hands While Sleeping

Numbness in Hands: నిద్రపోయి లేచిన వెంటనే చాలా మందికి చేతులు తిమ్మిర్లు పట్టినట్టు అనిపిస్తుంది. చేతులు మొద్దుబారిపోయినట్టుగా, స్పర్శ కూడా సరిగా తెలియనట్టుగా ఉంటుంది. ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో నిద్రపోవడం లేదా తలకింద చేతులు పెట్టుకుని పడుకోవడం వల్ల నరాలపై ఒత్తిడి పెరిగి ఇలా జరుగుతుంది. అయితే ఈ సమస్య వచ్చినప్పుడు కొన్ని సులభమైన వ్యాయామాలు చేస్తే త్వరగా ఉపశమనం పొందవచ్చు.

చేతులు తిమ్మిర్లు ఎందుకు వస్తాయి?

చాలామంది నిద్రపోయేటప్పుడు స్లీపింగ్ పొజిషన్ గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ గంటల తరబడి ఒకే విధంగా పడుకోవడం వల్ల చేతులు లేదా కాళ్లకు రక్తప్రసరణ తాత్కాలికంగా తగ్గుతుంది. ముఖ్యంగా తలకింద చేయి పెట్టుకుని నిద్రపోతే నరాలపై ఒత్తిడి పెరిగి ఉదయం లేచినప్పుడు చేతులు మొద్దుబారిపోతాయి. అప్పుడప్పుడు ఇలా జరగడం సాధారణమే. అయితే తరచూ జరిగితే జాగ్రత్త పడటం అవసరం.

తిమ్మిర్లు తగ్గేందుకు చేయాల్సిన వ్యాయామాలు

1. ఓపెన్ అండ్ క్లోజ్ వ్యాయామం

చేతులకు తిమ్మిర్లు వచ్చినప్పుడు రెండు చేతుల గుప్పిళ్లను మూసి తెరవడం చేయాలి. ఇలా 30 సెకన్ల పాటు నిరంతరం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అవసరమైతే రెండు సార్లు ఇలా చేయవచ్చు. దీంతో నరాల్లో ఉన్న బిగుతు తగ్గి చేతులు మామూలు స్థితికి వస్తాయి.

2. మణికట్టు తిప్పడం (రిస్ట్ రొటేషన్)

చేతులు మొద్దుబారిపోయినప్పుడు మణికట్టును అటూ ఇటూ తిప్పడం కూడా మంచిది. ఒకసారి క్లాక్ వైజ్, మరోసారి యాంటీ క్లాక్ వైజ్‌గా తిప్పాలి. ఇలా కనీసం ఒక నిమిషం పాటు చేస్తే మణికట్టులోని నరాలు, కండరాలు సడలిపోతాయి. చేతులు కదలడానికి ఇబ్బంది అనిపించినప్పుడు ఈ వ్యాయామం చాలా ఉపయోగపడుతుంది.

3. మణికట్టు లాగడం

ఒక చేతి వేళ్లను మరో చేతితో పట్టుకుని మెల్లగా వెనక్కి లాగాలి. అదే విధంగా మరో చేతితో కూడా చేయాలి. ఇలా చేయడం వల్ల మణికట్టుపై ఒత్తిడి పడుతూ కండరాల్లో కదలికలు వస్తాయి. దీంతో రక్తప్రసరణ మెరుగుపడి తిమ్మిర్లు తగ్గుతాయి. రెండు సెట్లుగా ఈ వ్యాయామం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పాటించాల్సిన జాగ్రత్తలు

  • తలకింద చేతులు పెట్టుకుని నిద్రపోవడం మానేయాలి.
  • నిద్రపోయే ముందు చేతి వేళ్లు, మణికట్టును కాస్త కదిలించడం మంచిది.
  • చేతులకు స్వల్పంగా మసాజ్ చేస్తే కూడా ఉపశమనం లభిస్తుంది.
  • బోర్లా పడుకునే అలవాటు తగ్గించాలి.
  • వెన్నెముక సరిగ్గా బెడ్‌కు ఆనుకునేలా నిద్రపోవాలి.
  • మ్యాట్రెస్ చాలా గట్టిగా ఉండకూడదు.

సరైన నిద్రపోయే విధానం పాటిస్తూ, పై వ్యాయామాలు చేస్తే చేతులకు వచ్చే తిమ్మిర్లు చాలా వరకు తగ్గుతాయి.

Also Read: Viral: షాకింగ్ సీన్.. పెళ్లి వేదికపైనే జంట లిప్ లాక్

Numbness in Hands: నిద్రలో చేతులు తిమ్మిర్లు పడుతున్నాయా..?