Sleep Jerks: నిద్రలో ఉలిక్కిపడుతున్నారా?.. కారణమిదే!

Hypnic Jerk: Why You Twitch When You Sleep

Hypnic Jerk: Why You Twitch When You Sleep

Sleep Jerks: నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా శరీరం ఉలిక్కిపడి లేచిన అనుభవం చాలామందికే ఉండే ఉంటుంది. ఈ పరిస్థితిని వైద్య భాషలో మనిషి నిద్రలోకి జారుకునే సమయంలో శరీరం మెల్లగా రిలాక్స్ అవుతుంది. కండరాలు సడలిపోతూ గాఢనిద్రకు సిద్ధమవుతాయి. ఈ దశలో కొన్ని సందర్భాల్లో మెదడు ఆ సడలింపును తప్పుగా అర్థం చేసుకుని, మనం ఎక్కడో నుంచి పడిపోతున్నామేమో అన్న భ్రమకు లోనవుతుంది. అప్పుడు శరీరాన్ని రక్షించాలనేలా ఒక్కసారిగా కండరాలకు సంకేతం పంపుతుంది. దీంతో శరీరం ఉలిక్కిపడి కదలడం లేదా చేతులు, కాళ్లు జర్క్ అవడం జరుగుతుంది. కొందరికి ఈ సమయంలో పడిపోతున్నట్టు లేదా జారిపోతున్నట్టు కల కూడా అనిపించవచ్చు.

అతిగా కాఫీ లేదా టీ తాగడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం, సరైన నిద్ర లేకపోవడం, రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉండటం వంటి కారణాలు ఈ సమస్యను మరింత పెంచుతాయి. అలాగే ఆందోళన, అలసట, అసమయపు జీవనశైలి కూడా దీనికి కారణమవుతాయి.

దీనిని తగ్గించుకోవాలంటే ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, కనీసం 7–8 గంటల నిద్ర తీసుకోవడం, సాయంత్రం తర్వాత కాఫీన్ తగ్గించడం, తేలికపాటి వ్యాయామం లేదా యోగా చేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేకపోయినా, ఇది తరచూ జరిగి నిద్రను తీవ్రంగా ప్రభావితం చేస్తే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

Also Read: Home Remedies: పాత బట్టలతో ఇల్లు తుడిస్తున్నారా..!

Sleep Jerks: నిద్రలో ఉలిక్కిపడుతున్నారా?.. కారణమిదే!