Holi: హోలీ అంటేనే రంగుల పండుగ. వసంతకాలంలో వచ్చే ఈ పండుగను దేశవ్యాప్తంగా చిన్నా–పెద్ద, పేద–ధనిక అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. స్నేహం, ప్రేమ, ఐక్యతను పంచుకునే పండుగగా హోలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. రంగులు చల్లుకుంటూ, పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ ప్రజలు ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి తెలుగు రాష్ట్రాల్లో కూడా హోలీని ప్రతి సంవత్సరం కొత్త ఉత్సాహంతో జరుపుకోవడం ఆనవాయితీ.
హోలీ 2026 తేదీ: సాధారణంగా హోలీ పండుగ ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి రోజున వస్తుంది. ఆ రోజే రంగులతో ఆడే ప్రధాన వేడుక జరుగుతుంది. హోలీకి ముందు రోజు జరిగే ముఖ్యమైన ఆచారం హోలిక దహన్.
హోలిక దహన్ ప్రాముఖ్యత: హోలిక దహన్ అనేది హోలీకి ముందు రోజు సాయంత్రం లేదా రాత్రి జరుపుకునే వేడుక. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావిస్తారు. ఆ రోజున భోగి మంటలలా అగ్ని వెలిగించి, ప్రజలు దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ప్రతికూల శక్తులు తొలగి సంతోషం, శుభం కలగాలని కోరుకుంటారు.
పురాణాల ప్రకారం, హిరణ్యకశిపుడు తన కుమారుడు ప్రహ్లాదుడిని చంపాలని అనేక ప్రయత్నాలు చేశాడు. చివరికి తన సోదరి హోలికను పంపి, ఆమెకు అగ్నిలో కాలిపోని వరం ఉండటంతో ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టి మంటల్లోకి దూకమన్నాడు. కానీ ప్రహ్లాదుడు విష్ణు నామస్మరణలో ఉండటంతో అతడికి ఏమీ కాలేదు. వరం ఉన్న హోలిక మాత్రం అగ్నిలో కాలిపోయింది. ఈ సంఘటన చెడు అంతానికి, మంచి విజయానికి సంకేతంగా భావించి హోలిక దహన్ నిర్వహిస్తారు.
కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో, పౌర్ణమి రోజున శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఊయలలో ఉంచి డోలికోత్సవంగా ప్రత్యేకంగా హోలీని జరుపుకుంటారు. మొత్తంగా హోలీ పండుగ ఆనందం, ఐక్యత, మంచి చెడుపై గెలిచే సంకేతాన్ని అందించే సాంప్రదాయ వేడుకగా నిలుస్తుంది.
Also Read: Adulteration Milk: 100 లీ. పాలలో 100 లీ. నీరు, 10 కేజీల యూరియా?
Holi: హోలీ పండుగ ఎప్పుడంటే?
