Sex Education: ఈ టైంలో సెక్స్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్..!

Best Times to Have Sex, According to Experts

Best Times to Have Sex, According to Experts

Sex Education: చాలా మంది శృంగార జీవితం గురించి పూర్తిగా అవగాహన లేకుండానే కొనసాగిస్తుంటారు. “ఎప్పుడు చేసినా సరే” అనుకునే వారు కూడా ఉన్నారు. కానీ నిపుణుల ప్రకారం, రోజులో ఏ సమయంలో శృంగారం చేస్తామన్నదానిపై దాని ప్రభావం మారుతూ ఉంటుంది. గర్భధారణ, ఆరోగ్యం, ఒత్తిడి తగ్గింపు వంటి అంశాలకు అనుసరించి సమయం కూడా ముఖ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పిల్లలు కలగాలని భావించే దంపతులకు ఉదయం సమయం అనుకూలంగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం 6 గంటల సమయంలో స్పెర్మ్ నాణ్యత మెరుగ్గా ఉండే అవకాశముందని చెబుతున్నారు. అలాగే ఉదయం 8 గంటల వరకు పురుషుల్లో టెస్టోస్టిరోన్ స్థాయులు ఎక్కువగా ఉండటం వల్ల శృంగార సామర్థ్యం కూడా బాగుంటుంది.

ఉదయం 8:30 ప్రాంతంలో శృంగారం చేయడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగవచ్చని నిపుణులు అంటున్నారు. ఇమ్యూనోగ్లోబిన్ స్థాయులు పెరిగి, ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి మెరుగుపడుతుంది.

మధ్యాహ్నం సమయంలో కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో శృంగారం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, మానసికంగా రిలీఫ్ లభిస్తుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్త్రీ, పురుషులిద్దరిలో హార్మోన్ స్థాయులు సమతుల్యంగా ఉండటంతో పరస్పర అనుబంధం పెరుగుతుంది. ఈ సమయంలో శృంగారం గుండె ఆరోగ్యానికి కూడా కొంత మేలు చేస్తుందని చెబుతున్నారు.

సాయంత్రం 7 గంటల సమయంలో శృంగారం చేస్తే రక్తప్రసరణ మెరుగవడంతో భావప్రాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే రాత్రి 8 గంటల సమయంలో శృంగారం చేయడం మెదడు పనితీరును ఉత్తేజితం చేస్తుందని, గుర్తుంచుకునే శక్తి పెరగడంలో సహాయపడవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి, శృంగారం విషయంలో సమయం కూడా ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. అయితే ప్రతి వ్యక్తి శరీర పరిస్థితి, జీవనశైలి వేరుగా ఉండటంతో, తమకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకోవడం ఉత్తమం. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు పరస్పర అవగాహన కూడా సంతృప్తికరమైన శృంగార జీవితానికి ముఖ్యమైనవి.

Also Read: Kharjura: ఖర్జూరా తింటే షుగర్ పెరుగుతుందా..?

Sex Education: ఈ టైంలో సెక్స్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్..!