Dates: ఉదయం పూట రోజూ ఖర్జూరాలు తింటే..

Benefits of Eating Dates on Empty Stomach

Benefits of Eating Dates on Empty Stomach

Dates: ఆరోగ్యంగా ఉండటం, సహజమైన అందాన్ని పొందడం కోసం సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. మనం తినే ఆహారం శరీరంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఏది పడితే అది తింటూ ఉంటే అనవసర జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే రోజువారీ డైట్‌లో పోషకాలు ఉన్న పదార్థాలను చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలలో ఖర్జూరాలు (డేట్స్) ముఖ్యమైనవి. చాలామంది అప్పుడప్పుడే ఒకటి రెండు తింటారు, కానీ ప్రతిరోజూ ఉదయం ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు లభిస్తాయి. ముఖ్యంగా స్కూల్‌కి వెళ్లే పిల్లలకు ఇవి ఇస్తే వారు మరింత బలంగా, చురుకుగా ఉంటారు.

ఖర్జూరాల్లో నియాసిన్, పొటాషియం, విటమిన్-B6, మెగ్నీషియం, రాగి, సెలీనియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతిరోజూ రెండు ఖర్జూరాలు తినడం వల్ల శరీరం ఎనర్జీగా ఉండటమే కాకుండా అలసట తగ్గుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కూడా వీటిని డైట్‌లో చేర్చుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

చర్మ సమస్యలతో బాధపడేవారికి కూడా ఖర్జూరాలు ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలోని పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, పొడిబారడం లేదా ఇతర సమస్యలు తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఇవి మేలు చేస్తాయి. ఖర్జూరాల్లో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహకరించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

జీర్ణ సమస్యలు ఉన్నవారు ఖర్జూరాలు తింటే మరింత ప్రయోజనం ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మెటబాలిజం కూడా వేగంగా పనిచేస్తుంది. అందుకే ప్రతిరోజూ పరిమితంగా ఖర్జూరాలు తినడం ఆరోగ్యానికి మంచి అలవాటుగా మారుస్తే శరీరం బలంగా, ఉత్సాహంగా ఉంటుంది.

Also Read: Post Office: రూ.200 పొదుపుతో.. రూ.10 లక్షల రాబడి

Dates: ఉదయం పూట రోజూ ఖర్జూరాలు తింటే..