Inter Results 2026: నేడే ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

TSBIE-TS Inter Results 2026 Live Updates: 1st, 2nd Year Result, Marks Memo Out Today At 11 AM, Download Link Here

TSBIE-TS Inter Results 2026 Live Updates: 1st, 2nd Year Result, Marks Memo Out Today At 11 AM, Download Link Here

Inter Results 2026: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఎదురుచూస్తున్న పరీక్షల ఫలితాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను ఈరోజు (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని విద్యాభవన్‌లో ప్రకటించనున్నారు.

ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అధికారికంగా విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదలైన వెంటనే, విద్యార్థులు తమ మార్కులను అధికారిక వెబ్‌సైట్లైన tgbie.cgg.gov.in మరియు results.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. అలాగే హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,89,126 మంది కాగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,07,949 మంది ఉన్నారు. దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఈ ఫలితాలపై ఆధారపడి ఉంది.

జనరల్ మరియు వొకేషనల్ విభాగాలకు చెందిన ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్లతో పాటు ఇతర న్యూస్ వెబ్‌సైట్లలో కూడా తమ వివరాలను నమోదు చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.

Also Read: IPL 2026: ప్రచారంలో బ్రేక్.. ఐపీఎల్ చూసిన సీఎం

Inter Results 2026: నేడే ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..