RRB: 22,000 జాబ్స్.. రేపటి నుంచే అప్లికేషన్లు

Railway RRB Group D Recruitment 2026, 22000 Posts

Railway RRB Group D Recruitment 2026, 22000 Posts

RRB: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది నిజంగా శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 2026 సంవత్సరానికి సంబంధించి గ్రూప్–డి విభాగంలో భారీగా ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. CEN 09/2025 నోటిఫికేషన్ ఆధారంగా ఈ నియామక ప్రక్రియ జరగనుంది. మొత్తం మీద సుమారు 22,000 పోస్టులను భర్తీ చేయనున్నట్లు RRB ప్రకటించింది.

మొత్తం ఖాళీల వివరాలు

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా రైల్వే శాఖలోని వివిధ విభాగాల్లో గ్రూప్–డి పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రకటించిన ఖాళీలు (టెంటేటివ్‌గా) సుమారు 22 వేల వరకు ఉన్నాయి.

పోస్టుల వారీగా ఖాళీలు

  • అసిస్టెంట్ (ట్రాక్ మెషిన్) – 600

  • అసిస్టెంట్ (బ్రిడ్జ్) – 600

  • ట్రాక్ మెయింటైనర్ (గ్రూప్ IV) – 11,000

  • అసిస్టెంట్ (P-Way) – 300

  • అసిస్టెంట్ (TRD) – 800

  • అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్) – 200

  • అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్) – 500

  • అసిస్టెంట్ (TL & AC) – 50

  • అసిస్టెంట్ (C & W) – 1,000

  • పాయింట్‌స్మాన్ B – 5,000

  • అసిస్టెంట్ (S & T) – 1,500

మొత్తం పోస్టులు: 22,000

అర్హతలు

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా సంబంధిత ట్రేడ్‌లో ITI పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి

  • కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు

  • గరిష్ఠ వయస్సు: 33 సంవత్సరాలు

  • రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది
    (వయస్సు లెక్కింపు తేదీ: 01-01-2026)

జీతం

ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం ప్రకారం నెలకు రూ.18,000 ప్రాథమిక జీతం చెల్లిస్తారు. అదనంగా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

దరఖాస్తు విధానం

అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేయాలి. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్లు

  • rrbchennai.gov.in

  • indianrailways.gov.in
    వాటిని ఉపయోగించవచ్చు.

ముఖ్యమైన తేదీలు

  • షార్ట్ నోటిఫికేషన్ విడుదల: 23-12-2025

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 20-01-2026

  • దరఖాస్తు ముగింపు తేదీ: 02-03-2026

అప్లికేషన్ ఫీజు

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన అప్లికేషన్ ఫీజు వివరాలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ద్వారా జరుగుతుంది:

  • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)

  • ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)

  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

Also Read: Thyroid: థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతే?

RRB: 22,000 జాబ్స్.. రేపటి నుంచే అప్లికేషన్లు