Prabhas: ‘ఫౌజీ’ షూటింగ్ లో ప్రభాస్ కు గాయం

Prabhas Injured on the Sets of Hanu Raghavapudi's Fauzi

Prabhas Injured on the Sets of Hanu Raghavapudi's Fauzi

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజీ’ షూటింగ్ సమయంలో చిన్న ప్రమాదం జరిగినట్టు సమాచారం. గుర్రపు స్వారీకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ప్రభాస్‌కు స్వల్ప గాయం అయినట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇది పెద్ద ప్రమాదం కాదని, చిన్న గాయమేనని సినిమా బృందం స్పష్టం చేసింది. ప్రభాస్ పూర్తిగా సురక్షితంగా ఉన్నారని, ఫ్యాన్స్ ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదని మేకర్స్ తెలిపారు.

ఇటీవల కాలంలో షూటింగ్‌లలో ప్రభాస్‌కు గాయాలు కావడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇదే ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ సమయంలోనే గతంలో కూడా ఆయనకు రెండు సార్లు గాయాలైనట్టు సమాచారం. గత ఏడాది జూలైలో కాలికి ఫ్రాక్చర్ అయ్యిందన్న వార్తలు వచ్చాయి. అంతకుముందు షూటింగ్‌లో కాలికి దెబ్బ తగలడంతో కొంతకాలం షూటింగ్స్‌కు విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇటలీకి వెళ్లి కాలుకు శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారని తెలిసింది.

ప్రస్తుతం ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ కీలక దశలో కొనసాగుతోంది. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయని సమాచారం. గుర్రపు స్వారీతో పాటు హై వోల్టేజ్ చేజింగ్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశాలే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. భారీ సెట్స్, ఆధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ యాక్షన్ భాగాలను రూపొందిస్తున్నారు. ప్రభాస్ భద్రత కోసం ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లు సమాచారం. గాయం కారణంగా కొన్ని రోజులు ఆయన షూటింగ్‌కు విరామం తీసుకునే అవకాశం ఉంది. ఈ లోపు ఇతర సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేయాలని యూనిట్ భావిస్తోంది.

ఇక ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే, ఇటీవల వచ్చిన ‘రాజా సాబ్’ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆయన మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారని తెలుస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ చేస్తూనే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమాను కూడా ప్రారంభించారు. ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంది. ఇకపై ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదల చేయాలనే లక్ష్యంతో ప్రభాస్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Also Read: Instagram: 16 గంటల పాటు ఇన్ స్టా వాడకం వ్యసనం కాదట..!

Prabhas: ‘ఫౌజీ’ షూటింగ్ లో ప్రభాస్ కు గాయం