Vijay-Rashmika: విజయ్- రష్మిక పెళ్లికార్డు వైరల్!

Vijay Deverakonda – Rashmika Mandanna’s wedding card goes viral online

Vijay Deverakonda – Rashmika Mandanna’s wedding card goes viral online

Vijay-Rashmika: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లికి సంబంధించిన ఒక ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ కార్డ్‌లోని వివరాల ప్రకారం, ఇద్దరూ తమ కుటుంబాల ఆశీస్సులతో 2026 ఫిబ్రవరి 26న కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో సాదాసీదా వివాహ వేడుకలో పెళ్లి చేసుకోనున్నట్లు పేర్కొన్నారు. తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నామని కూడా ఆ పత్రికలో సందేశం ఉంది.

ఇక వివాహం తర్వాత సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం ప్రత్యేకంగా ఒక గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ రిసెప్షన్ మార్చి 4, 2026న బుధవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తాజ్ కృష్ణ హోటల్‌లో సాయంత్రం 7 గంటల నుంచి నిర్వహించనున్నట్లు ఆహ్వానంలో పేర్కొన్నారు. తమ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఈ వేడుకకు హాజరై ఆశీర్వదించాలని విజయ్, రష్మిక కోరినట్లు అందులో తెలిపింది.

ఈ ఆహ్వాన పత్రిక నెట్టింట బయటకు రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. చాలా మంది సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ వార్తపై విజయ్ దేవరకొండ లేదా రష్మిక మందన్న నుంచి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అందువల్ల ఈ పెళ్లి వార్త నిజమా కాదా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

Also Read: Gold Rates: 10 గ్రాముల బంగారం ధర లక్షలోపే…!

Vijay-Rashmika: విజయ్- రష్మిక పెళ్లికార్డు వైరల్!