Vijay-Rashmika: ❤️ బుజ్జి ఫ్యాన్ కోరిక తీర్చిన విజయ్, రష్మిక

Reel To Real Moment': Fan's Dream Comes True As Rashmika Mandanna, Vijay Deverakonda Meet Her; Video

Reel To Real Moment': Fan's Dream Comes True As Rashmika Mandanna, Vijay Deverakonda Meet Her; Video

Vijay-Rashmika: ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ–రష్మిక జంట మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఒక చిన్నారి అభిమాని కోరికను తీర్చడం ద్వారా అందరి మనసులు గెలుచుకున్నారు. తమ పెళ్లికి పిలవలేదని అలిగిన ఓ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, విజయ్ స్పందించి ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించారు.

ఆ చిన్నారి వీడియోలో, “విజయ్ దేవరకొండ–రష్మిక పెళ్లి చేసుకున్నారు.. కానీ నన్ను పిలవలేదు. లడ్డూలు పెడుతున్నారు, అన్నదానాలు చేస్తున్నారు.. నేను కూడా ఫ్యానే కదా.. నన్ను కూడా పిలిస్తే ఏమవుతుంది?” అంటూ అమాయకంగా తన అభిమానం వ్యక్తం చేసింది. ఈ వీడియో చూసిన విజయ్, వెంటనే స్పందిస్తూ “బుజ్జి తల్లీ.. నిన్ను మా ఇంటికి లంచ్‌కి పిలుస్తా. నీకు ఇష్టమైన వంటలు, స్వీట్స్ చెప్పు.. అన్నీ తయారు చేసి కలిసి తిందాం” అని మాటిచ్చారు.

చెప్పినట్లుగానే విజయ్ ఆ చిన్నారిని తన ఇంటికి ఆహ్వానించారు. ఆమెకు ఇష్టమైన పులిహోర, లడ్డూలను ప్రత్యేకంగా తయారు చేయించి, విజయ్–రష్మిక ఇద్దరూ స్వయంగా వడ్డించారు. ఆ తర్వాత ఆ పాపతో కలిసి సరదాగా గడిపి, ప్రేమగా మాట్లాడారు. “ఇప్పుడు లడ్డూలు తిన్నావ్ కదా.. ఇక మనం ఫ్రెండ్స్ కదా?” అని విజయ్ అడగగా, ఆ చిన్నారి సంతోషంగా ‘అవును’ అని సమాధానం చెప్పింది.

ఇటీవల తమ పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించిన ఈ జంట, దేశవ్యాప్తంగా స్వీట్లు పంపిణీ చేయడంతో పాటు అన్నదానాలు కూడా చేశారు. సినీ, రాజకీయ ప్రముఖులతో గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించారు. అయితే తమను పిలవలేదని అలిగిన చిన్నారి కోరికను ఇలా తీర్చడం అభిమానులను మరింత ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

Also Read: Nasik: ఆ కోరిక తీర్చకపోతే తన భర్త చనిపోతాడని నమ్మించి.. వెలుగులోకి జ్యోతిష్యుడి అరాచకాలు

Vijay-Rashmika: ❤️ బుజ్జి ఫ్యాన్ కోరిక తీర్చిన విజయ్, రష్మిక