Kajal Aggarwal: నేను బతికే ఉన్నా.. ప్లీజ్ ఆ వార్తలు నమ్మకండి: కాజల్ అగర్వాల్

Kajal Aggarwal met with road accident? Sikandar actress breaks silence amid reports

Kajal Aggarwal met with road accident? Sikandar actress breaks silence amid reports

Kajal Aggarwal: తెలుగు తెరపై చందమామగా పేరు తెచ్చుకున్న ఉత్తరాది సుందరి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అగ్ర హీరోల సరసన అనేక విజయవంతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇటీవల ఆమె అభిమానులు, ప్రేక్షకులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కారణం– కాజల్ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడమే.

ఈ వార్త కాజల్ దృష్టికి చేరడంతో, ఆమె వెంటనే స్పందించి క్లారిటీ ఇచ్చారు. “నాకు యాక్సిడెంట్ జరిగిందని, మరణించానని కొన్ని నిరాధార వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్తలు చూసి నేనూ ఆశ్చర్యపోయాను. అందులో ఏమాత్రం నిజం లేదు. దేవుడి దయవల్ల నేను పూర్తిగా క్షేమంగా ఉన్నాను. అలాంటి ఫేక్ న్యూస్‌ను నమ్మకండి. నిజం, పాజిటివిటీ మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను” అని కాజల్ సోషల్ మీడియాలో స్పష్టం చేశారు.

ఇక సినిమాల విషయానికి వస్తే… విష్ణు మంచు హీరోగా తెరకెక్కుతున్న కన్నప్ప చిత్రంలో కాజల్ పార్వతీ దేవి పాత్రలో, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సరసన కనిపించారు. అంతేకాదు, రాకింగ్ స్టార్ యష్, రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న రామాయణలో మండోదరి పాత్ర పోషిస్తున్నారు. అలాగే, లోక నాయకుడు కమల్ హాసన్ సరసన నటించిన ఇండియన్ 3 విడుదలకు సిద్ధంగా ఉంది.

కాజల్ ఇచ్చిన ఈ స్పష్టతతో అభిమానులు ఊపిరి పీల్చుకుని, ఆమె సురక్షితంగానే ఉన్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Andhra: ‘సీఎంలు, మంత్రులూ సినిమాల్లో నటించొచ్చు’

Kajal Aggarwal: నేను బతికే ఉన్నా.. ప్లీజ్ ఆ వార్తలు నమ్మకండి: కాజల్ అగర్వాల్