Jr.NTR: ఎన్టీఆర్ సినిమాలో మలయాళీ స్టార్ హీరో

Jr.NTR

Jr.NTR

Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 చిత్రీకరణలో పాల్గొంటుండగా.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో తారక్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోయే సినిమాలో మలయాళీ స్టార్ హీరో నటించనున్నట్లు సమాచారం. అతడు మరెవరో కాదు.. టొవినో థామస్.

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలో కనిపిస్తారో తెలియదు కానీ.. ఆయన ఈ ప్రాజెక్టులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టొవినో థామస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి ఉన్న ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో తారక్ జోడిగా రుక్మిణీ వసంత్ నటిస్తున్నారు. పీరియాడిక్ కథతో రూపొందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read : Second Hand Cars: ఇక్కడ రూ.50 వేలకే కారు

Jr.NTR: ఎన్టీఆర్ సినిమాలో మలయాళీ స్టార్ హీరో