Vijay Thalapathy: తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన దళపతి విజయ్ ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటివరకు వరుస సినిమాలతో అభిమానులను అలరించిన ఆయన, ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకుని టీవీకే (TVK) పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో ఆయన వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు బయటకు రావడంతో ఈ విషయం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసింది.
ఇప్పటికే విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన భర్తకు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ ఆమె విడాకులు ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 24న ఈ పిటిషన్‌ను సమర్పించగా, ఈ కేసు విచారణ ఏప్రిల్ 20న జరగనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో విజయ్ తన భార్యకు భరణంగా దాదాపు రూ.250 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు కూడా సినీ వర్గాల్లో ప్రచారం అవుతున్నాయి.
ఇక తాజాగా ఈ వ్యవహారంలో మరో మలుపు చోటుచేసుకుంది. విజయ్‌పై సంగీత రెండో పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు సమాచారం. విడాకుల కేసు పూర్తయ్యే వరకు తాను విజయ్ ఇంట్లోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు. తన భర్తకు మరో నటితో ఉన్న సంబంధం కారణంగానే తమ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని పిటిషన్లో పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా ఈ సమస్య వల్ల తాను తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నానని కూడా ఆమె వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆ నటితో సంబంధం కొనసాగిస్తూ విజయ్ తనను మోసం చేశారని, తనపై వేధింపులకు కూడా పాల్పడ్డారని సంగీత ఆరోపించారు.
ఈ నేపథ్యంలో విజయ్ వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఇదిలా ఉండగా ఇటీవల చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకకు విజయ్ హీరోయిన్ త్రిషతో కలిసి హాజరయ్యారు. ఇద్దరూ ఒకే రంగు దుస్తుల్లో రావడం కూడా అభిమానుల మధ్య చర్చకు దారి తీసింది. ఇప్పటికే విజయ్‌కు ఓ నటితో సంబంధం ఉందని ఆయన భార్య ఆరోపించిన నేపథ్యంలో, త్రిషతో కలిసి కార్యక్రమానికి రావడం మరింత ఆసక్తికరంగా మారింది.
ఇప్పుడు విడాకుల కేసు కొనసాగుతున్న సమయంలో సంగీత మరో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వ్యవహారం మళ్లీ వార్తల్లో నిలిచింది. దీంతో విజయ్ వ్యక్తిగత జీవితం, ఆయనపై వస్తున్న ఆరోపణలు ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read: Summer Tips: వాహనం తీస్తున్నారా? ఓ సారి చెక్ చేయండి!
Vijay Thalapathy: విజయ్ తోనే ఉంటా: మరో బాంబ్ పేల్చిన సంగీత
