Gold, Silver Prices: అమెరికా–వెనిజులా మధ్య నెలకొన్న తీవ్రమైన ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. సోమవారం నుంచి బంగారం, వెండి ధరల్లో వరుసగా పెరుగుదల కనిపిస్తోంది. వెనిజులా అధ్యక్షుడిని అమెరికా అదుపులోకి తీసుకోవడం ప్రపంచ రాజకీయాల్లో సంచలనంగా మారగా, జియోపాలిటికల్ అనిశ్చితి మరింత పెరిగింది. ఈ పరిస్థితుల్లో మార్కెట్లలో ఒడిదొడుకులు ఏర్పడి, అమ్మకాల ఒత్తిడి పెరిగింది.
ఈ కారణంగా పెట్టుబడిదారులు భద్రమైన పెట్టుబడిగా బంగారాన్ని ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా గోల్డ్, వెండి రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. బుధవారం కూడా బంగారం ధరలు మరోసారి పెరిగాయి. ఈ నేపథ్యంలో బుధవారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు (10 గ్రాములు)
-
హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,38,830గా ఉంది. నిన్న ఇది రూ.1,38,820 వద్ద నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,260గా కొనసాగుతోంది.
-
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,830గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,27,260 వద్ద స్థిరంగా ఉంది.
-
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,980గా ఉంది. మంగళవారం ఇది రూ.1,39,970గా నమోదైంది. 22 క్యారెట్ల ధర రూ.1,28,310 వద్ద ట్రేడవుతోంది.
-
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,830గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,38,820 వద్ద ఉంది.
-
ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,980గా కొనసాగుతుండగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,27,410 వద్ద స్థిరపడింది.
వెండి ధరలు (కేజీకి)
-
ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,53,100గా కొనసాగుతోంది.
-
హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.2,71,100గా ఉంది.
-
చెన్నైలో కూడా కేజీ వెండి ధర రూ.2,71,100 వద్ద స్థిరంగా నమోదైంది.
అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో రానున్న రోజుల్లోనూ పసిడి, వెండి ధరల్లో మార్పులు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
