Reliance Jio: దీపావళి, ధంతేరాస్ పండుగల సందర్బంగా రిలయన్స్ జియో సంస్థ తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ పండుగ సీజన్‌లో జియో రూ.349తో కొత్త స్పెషల్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి.
ఇది మాత్రమే కాకుండా, ఈ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు అదనంగా 3 నెలల పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా అందుతుంది. ఈ సబ్స్క్రిప్షన్ మొబైల్ లేదా టీవీ రెండింటిలోనూ ఉపయోగించుకోవచ్చు. అలాగే జియో క్లౌడ్ స్టోరేజ్‌లో 50GB స్థలాన్ని ఫ్రీగా పొందే అవకాశం కల్పించారు.
ఇంకా వినియోగదారుల కోసం మరో అదనపు ప్రయోజనం కూడా ఉంది. హోమ్ ఇంటర్నెట్, స్మార్ట్ డివైజెస్ మరియు ఎంటర్టైన్మెంట్ సేవలు కలిపిన జియో హోమ్ ఫ్రీ ట్రయల్ సేవను రెండు నెలలపాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు జియో ఎకోసిస్టమ్‌లోని వివిధ స్మార్ట్ సర్వీసులను అనుభవించవచ్చు.
జియో సంస్థ ప్రతి పండుగ సీజన్‌లో వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లను అందించడం తెలిసిందే. ఈసారి ప్రకటించిన దీపావళి ఆఫర్ కూడా టెలికాం వినియోగదారులకు లాభదాయకంగా నిలుస్తుందని అంచనా. డేటా, ఎంటర్టైన్మెంట్, కనెక్టివిటీ సేవలన్నీ ఒకే ప్లాన్‌లో అందించడం ద్వారా జియో మరోసారి తన మార్కెట్ ఆధిపత్యాన్ని కొనసాగించనుంది.
