Gold Rates: దేశంలో ఇటీవల పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ ఉదయం బంగారం ధరలు మరోసారి తగ్గాయి. తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.810 తగ్గి రూ.1,25,080గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.750 తగ్గి రూ.1,14,650గా, 18 క్యారెట్ల బంగారం ధర రూ.610 తగ్గి రూ.93,810గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి రూ.1,26,030గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.750 తగ్గి రూ.1,14,800గా, 18 క్యారెట్ల బంగారం రూ.10 తగ్గి రూ.94,560గా ఉంది. ముంబైలో కూడా 24 క్యారెట్ల బంగారం రూ.810 తగ్గి రూ.1,25,080గా, 22 క్యారెట్లది రూ.1,14,650గా, 18 క్యారెట్లది రూ.93,810గా ఉంది.
వెండి ధరలు కూడా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర రూ.1,000 తగ్గి రూ.1,74,000గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి రూ.1,000 తగ్గి రూ.1,59,000గా, ముంబైలోనూ అదే ధర కొనసాగుతోంది.
