Gold Rates: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా యుద్ధానికి దిగడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మార్కెట్లపై ప్రభావం పడుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య అనంతరం ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేపట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. యుద్ధం తీవ్రత పెరగడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై డిమాండ్ పెరిగి, పసిడి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి.
రానున్న కొన్ని రోజుల పాటు కూడా బంగారం ధరలు ఇదే స్థాయిలో లేదా మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో ధరల పెరుగుదల కొనుగోలుదారులకు అదనపు భారంగా మారింది. ఈ నేపథ్యంలో సోమవారం మరోసారి బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న తాజా రేట్లను ఒకసారి పరిశీలిద్దాం.
బంగారం ధరలు (10 గ్రాములకు)
-
హైదరాబాద్:
24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,73,090గా ఉంది. నిన్న ఇది రూ.1,73,080గా నమోదైంది.
22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,58,660 వద్ద కొనసాగుతోంది. ఆదివారం ఇది రూ.1,58,650గా ఉంది. -
విజయవాడ, విశాఖపట్నం:
24 క్యారెట్ల బంగారం ధర రూ.1,73,090గా ఉండగా,
22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,58,660 వద్ద ట్రేడవుతోంది. -
చెన్నై:
24 క్యారెట్ల బంగారం ధర రూ.1,72,100గా ఉంది. నిన్న ఇది రూ.1,72,090గా నమోదైంది.
22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,57,760గా ఉంది. ఆదివారం ఇది రూ.1,57,750గా ఉంది. -
బెంగళూరు:
24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,73,090గా కొనసాగుతోంది. నిన్న రూ.1,73,080గా ఉంది.
22 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,660గా ఉంది. ఆదివారం రూ.1,58,650గా నమోదైంది. -
ఢిల్లీ:
దేశ రాజధానిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,73,240గా ఉండగా,
22 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,810 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు (కేజీకి)
-
ఢిల్లీ: కేజీ వెండి ధర రూ.2,94,900గా ఉంది. ఆదివారం ఇది రూ.2,95,000గా నమోదైంది.
-
హైదరాబాద్: కేజీ వెండి ధర రూ.3,25,100గా కొనసాగుతోంది. నిన్న ఇది రూ.3.25 లక్షలుగా ఉంది.
-
చెన్నై: ఇక్కడ కూడా కేజీ వెండి ధర రూ.3,25,100 వద్దే ఉంది.
-
బెంగళూరు: కేజీ సిల్వర్ ధర రూ.2,94,900గా ఉంది. నిన్న ఇది రూ.2.95 లక్షలుగా నమోదైంది.
ఫైనల్ గా చూస్తే, యుద్ధ భయాలు తగ్గే వరకు బంగారం, వెండి ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
