Gold Price: పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి ముఖ్యమైన సమాచారం. ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు మళ్లీ పైకి ఎగబాకాయి.
ఇరాన్–ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం ముగిసే అవకాశాలు ఉన్నాయని ఆయన సంకేతాలు ఇచ్చారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గవచ్చని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు 26 శాతం వరకు పడిపోయాయి. అలాగే అమెరికా డాలర్ విలువ కూడా కొంత తగ్గింది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు మళ్లీ బంగారంపై దృష్టి పెట్టడంతో పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
గత వారం రోజులుగా తులం బంగారం ధర దాదాపు రూ.20 వేల వరకు తగ్గింది. అయితే ఈరోజు మళ్లీ పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా వెండి ధరలో కూడా భారీ మార్పు కనిపించింది.
గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఒక్కసారిగా పెరిగింది. ఒక ఔన్స్ బంగారం ధర సుమారు 125 డాలర్లు పెరిగి 5218 డాలర్లకు చేరింది. అదే సమయంలో వెండి ధర కూడా పెరిగింది. ఔన్స్ సిల్వర్ ధర 5.49 శాతం పెరిగి 88.81 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
హైదరాబాద్‌లో బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరిగాయి.
- 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.650 పెరిగి రూ.1,48,850కు చేరింది.
- 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.700 పెరిగి రూ.1,62,380 వద్దకు చేరింది.
వెండి ధరలో భారీ పెరుగుదల
దేశీయ మార్కెట్లో గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన వెండి ధర ఈరోజు ఒక్కసారిగా పెరిగింది. కిలో వెండి ధర రూ.10,000 పెరిగి మళ్లీ రూ.3 లక్షల మార్క్ చేరింది. ప్రస్తుతం కిలో వెండి ధర సుమారు రూ.3,00,000 వద్ద ట్రేడవుతోంది.
ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు మార్చి 11 బుధవారం ఉదయం 7 గంటల సమయం వరకు నమోదైనవి. బులియన్ మార్కెట్లో ధరలు రోజులో మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కొనుగోలు చేయాలనుకునే వారు స్థానికంగా తాజా ధరలు తెలుసుకోవడం మంచిది.
Also Read: Health Tips: ఈ టైమ్‌లో ఎండలో నిలబడండి..
Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధరలు
