Accident: ప్రతి రోజు ప్రజలు తమ పనుల నిమిత్తం ఆఫీసులు, పాఠశాలలు లేదా మార్కెట్‌లకు వెళ్తుంటారు. అయితే రోడ్డుపై ముందుజాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ఇటీవలి ఉదంతం మియాపూర్‌లో చోటుచేసుకున్న విషాదకర ఘటనే దీనికి నిదర్శనం.
స్కూల్ పిల్లలను తీసుకెళ్లే బస్సు డ్రైవర్లు ఓపికతో నెమ్మదిగా వాహనాలను నడపాలి. అలాంటి నిష్ఠాతులైన డ్రైవర్లనే స్కూల్ యాజమాన్యాలు నియమించుకోవాలి. తల్లిదండ్రులు కూడా ఒకసారి తనిఖీ చేసుకోవాలి. వ్యక్తి మృతికి కారణమైన ఈ సంఘటన మియాపూర్ స్టేషన్ పరిధిలో జరిగింది.#SchoolBusAccident #Miyapur pic.twitter.com/KPuVZNbdZh
— Telangana Police (@TelanganaCOPs) August 1, 2025
తెలంగాణలోని మియాపూర్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో, ఒక బైక్ రైడర్ కూడలిని దాటేందుకు ప్రయత్నించగా, వేగంగా వస్తున్న ఒక స్కూల్ బస్సు అతన్ని నేరుగా ఢీకొట్టింది. ఆ ఢీకొట్టిన తీవ్రత అంత ఎక్కువగా ఉండడంతో, బైక్ రైడర్ రోడ్డుపై పడిన వెంటనే అక్కడికక్కడే మరణించాడు.
ఈ సంఘటన షాక్‌కు గురిచేసేలా ఉండగా, అదే సమయంలో ఆ కూడలి గుండా వెళ్తున్న ఓ కారులో అమర్చిన డాష్‌క్యామ్ ద్వారా ఈ మొత్తం దృశ్యం రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ ఘటనతో రోడ్డు ప్రమాదాలపై ప్రజలంతా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమవుతోంది.
