Term Life Insurance: మన కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత మనదే. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. నేటి అనిశ్చిత కాలంలో కుటుంబ భవిష్యత్తుకు సరైన రక్షణ కల్పించడం చాలా అవసరం. మనం లేని సమయంలో కూడా మన కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ (Term Life Insurance) ఒక అద్భుతమైన సాధనం. అందుకు వేలకు వేలు కావాలేమో అనుకుంటున్నారా.. అస్సలు కాదు.. కేవలం నెలకి రూ. 500 నుండి రూ. 600 చిన్న మొత్తంతోనే రూ. 1 కోటి వరకు లైఫ్ కవర్ (Life Cover) పొందవచ్చనే విషయం మీకు తెలుసా?

టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అత్యంత స్పష్టమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్యూర్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. పాలసీ కాలవ్యవధిలో పాలసీదారునికి ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే, ఇన్సూరెన్స్ కంపెనీ నామినీకి రూ. 1 కోటి క్లెయిమ్ మొత్తాన్ని ఏకకాలంలో చెల్లిస్తుంది. ఈ డబ్బుతో కుటుంబం తమ అప్పులు తీర్చుకోవడం, పిల్లల చదువులు, భవిష్యత్తు అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది.
తక్కువ ప్రైస్‌కే రూ. 1 కోటి కవర్ ఎలా సాధ్యం?
-
వయస్సు ప్రాముఖ్యత: మీరు 20 నుండి 30 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు టర్మ్ ప్లాన్ తీసుకుంటే ప్రీమియం అత్యంత తక్కువగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న యువకులకు నెలకు రూ. 500 చెల్లిస్తే రూ. 1 కోటి కవర్ సులభంగా లభిస్తుంది.
-
ఆన్లైన్ ప్లాన్స్: ఏజెంట్ల ప్రమేయం లేకుండా ఆన్లైన్ ద్వారా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీల నుండి ప్లాన్ తీసుకోవడం వల్ల కమీషన్ ఖర్చులు తగ్గి ప్రీమియం మరింత చౌకగా మారుతుంది.
-
పొగతాగని వారికి వెసులుబాటు: ధూమపానం (Smoking) చేయని వారికి ఇన్సూరెన్స్ కంపెనీలు తక్కువ ప్రీమియానికే పాలసీలను అందిస్తాయి.
టర్మ్ ఇన్సూరెన్స్ ఎంచుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
-
క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో (CSR): ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్‌లను ఎంత వేగంగా, ఎంత శాతం (98% కంటే ఎక్కువ ఉన్నవి ఉత్తమం) ఆమోదిస్తుందో చూసుకోవాలి.
-
రైడర్లు (Riders): క్రిటికల్ ఇల్నెస్ (తీవ్రమైన అనారోగ్యం) లేదా ప్రయాణ ప్రమాద రక్షణ వంటి అదనపు ప్రయోజనాలను (Riders) జోడించుకోవచ్చు.
-
పారదర్శకత: పాలసీ తీసుకునేటప్పుడు మీ ఆరోగ్య స్థితి, అలవాట్ల గురించి సరైన సమాచారం అందించాలి.
చిన్న మొత్తంతో మీ కుటుంబానికి పెద్ద ఆర్థిక రక్షణ కల్పించడానికి టర్మ్ ఇన్సూరెన్స్ సరైన మార్గం. సో ఇప్పుడే పైన చెప్పిన పాలసీ తీసుకునేందుకు ప్రయత్నించండి
Also Read: Small Business Ideas: జస్ట్ రూ.50వేలతో ఊర్లోనే మంచి బిజినెస్.. ఇప్పుడే స్టార్ట్ చేయండి
