Business Idea: పేపర్ ప్లేట్ బిజినెజ్.. తక్కువ పెట్టుబడితో.. ఇంటి నుంచే ఆదాయం!

Business: A Simple Guide for Paper plate business get High Profits

Business: నేటి కాలంలో సొంతంగా ఏదైనా వ్యాపారం (Business) ప్రారంభించి నెలకు మంచి ఆదాయం సంపాదించాలని చాలామంది అనుకుంటారు. అయితే ఎక్కువ పెట్టుబడి పెట్టలేక వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం అతి తక్కువ ఖర్చుతో, స్వల్ప స్థలంలో ప్రారంభించగలిగే బెస్ట్ కాటేజ్ బిజినెస్ ఐడియా… “పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారం”.

ప్రస్తుతం ప్లాస్టిక్ వాడకంపై నిషేధం ఉండటం, పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలు, హోటళ్లు, ఫంక్షన్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో పేపర్ ప్లేట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ బిజినెస్‌ను తక్కువ ఖర్చుతో ఎలా ప్రారంభించాలో సులువైన భాషలో తెలుసుకుందాం.

Top 5 Reasons to Start a Paper Plate Making Business

1. అవసరమైన యంత్రాలు, పెట్టుబడి

ఈ వ్యాపారాన్ని మీ ఇంట్లోని ఒక చిన్న గదిలోనే ప్రారంభించవచ్చు.

  • మ్యాన్యువల్ లేదా సెమీ-ఆటోమేటిక్ మిషన్లు: ప్రారంభంలో తక్కువ ఖర్చుతో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే హ్యాండ్ ఆపరేటెడ్ లేదా సెమీ-ఆటోమేటిక్ మిషన్లను ఎంచుకోవచ్చు. వీటి ధర సుమారు రూ.25,000 నుండి రూ.60,000 వరకు ఉంటుంది.

  • కచ్చా సరుకు (Raw Material): డిజైన్ ఉన్న పేపర్ రోల్స్, PE కోటెడ్ పేపర్లు, డైలు (Dies), ప్యాకింగ్ కవర్లు అవసరం. వీటికి రూ.10,000 నుండి రూ.15,000 వరకు సరిపోతుంది.

  • మొత్తం పెట్టుబడి: దాదాపు రూ.40,000 నుండి రూ.75,000 పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని హ్యాపీగా మొదలుపెట్టవచ్చు.

2. మార్కెటింగ్, విక్రయం (సేల్స్)

ఏ వ్యాపారానికైనా అమ్మకాలే ప్రాణం. తయారైన ప్లేట్లను ఎక్కడ అమ్మాలి?

  • మీ ప్రాంతంలోని కిరాణా షాపులు, హోల్‌సేల్ డిస్పోజబుల్ షాపులు, కేటరింగ్ సర్వీస్ వాళ్లు, ఫాస్ట్ ఫుడ్ బండ్లు మరియు హోటళ్లను నేరుగా కలవాలి.

  • మార్కెట్‌లో ఉన్న మిగతా వారికంటే ప్రారంభంలో 20-30 పైసలు తక్కువ ధరకు ఇస్తే హోల్‌సేలర్లు మీ దగ్గర నుంచే సరుకు కొనడానికి ఆసక్తి చూపుతారు.

JK DHOOP Paper Plate Making Machine, 320, Production Capacity: 1000 at ₹ 95000 in Kottuvally

3. లాభాలు ఎంత ఉంటాయి?

పేపర్ ప్లేట్ వ్యాపారంలో దాదాపు 25% నుండి 35% వరకు నికర లాభం (Net Profit) ఉంటుంది.

  • రోజూ సరిగ్గా 4,000 నుండి 5,000 ప్లేట్లు తయారు చేసి అమ్మగలిగితే, అన్ని ఖర్చులు (కరెంట్ బిల్లు, రా మెటీరియల్, ప్యాకింగ్) పోను రోజుకు రూ.800 నుండి రూ.1,500 వరకు నికర లాభం వస్తుంది.

  • అంటే నెలకు సులభంగా రూ.25,000 నుండి రూ.45,000 వరకు ఆదాయం పొందవచ్చు.

క్వాలిటీ.. నమ్మకం

పేపర్ ప్లేట్ల వాడకం రోజురోజుకూ పెరుగుతోంది తప్ప తగ్గదు. కాబట్టి క్వాలిటీ, సకాలంలో సరుకు అందించే నమ్మకం ఉంటే ఈ వ్యాపారంలో త్వరగా నిలదొక్కుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో గృహిణులు, నిరుద్యోగులు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ఇది ఒక చక్కటి సవర్ణావకాశం!

Also Read: Oldest Temple: తెలంగాణలో అతి పురాణ ఆలయం.. యాద్రాది, రామప్ప కానేకాదు