Crime: చీరలు కొనివ్వలేదని.. భర్తను కుక్కర్ మూతతో కొట్టి..

Crime: Woman beat Her Husband with Pressure Cooker lid

Crime: సోషల్ మీడియాలో తాజాగా ఒక సంచలనాత్మక వార్త బాగా వైరల్ అవుతోంది. మహారాష్ట్రలో ఒక మహిళ తనకు కొత్త చీర కొనివ్వలేదనే కోపంతో భర్తను ఏకంగా “కుక్కర్‌ మూతతో కొట్టి చంపేసిందంటూ(Crime)” అనేక పోస్ట్‌లు, థంబ్‌నెయిల్స్ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలో అసలు నిజమెంత? బాధితుడిని నిజంగానే కుక్కర్‌లో ఉడికించి చంపేశారా? ఈ విషయమై నిజానిజాలను పరిశీలిస్తే షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

Woman Beats Husband With Cooker Lid, Strangles Him For Not Buying Sarees In Thane

అసలు ఏం జరిగింది?

మహారాష్ట్రలోని థానే జిల్లా, బద్లాపూర్ ఈస్ట్ ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న విపరీతంగా ప్రచారమవుతోంది.

బాధితుడు హరిరామ్ సింగ్ (35) తన భార్య సునీతా దేవికి (30) కొన్ని రోజులుగా కొత్త చీర కొనివ్వడం లేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన భార్య సునీత, ప్రెషర్ కుక్కర్ మూతతో (Pressure Cooker Lid) భర్త తలపై బలంగా బాది, ఆ తర్వాత అతడి గొంతు నులిమి హత్య చేసింది.

అంతే తప్ప, కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా భర్తను కుక్కర్‌లో పెట్టి లేదా ఉడికించి చంపలేదు. కుక్కర్ మూతను ఒక ఆయుధంగా మాత్రమే వాడి దాడి చేసింది.

వామ్మో మరీ ఇలా ఉన్నారేంటక్కా.. చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య! | Woman Kills Disabled Husband with Pressure Cooker Over Saree Dispute in Badlapur | TV9 Telugu

నేరం దాచేందుకు నాటకం:

హత్య చేసిన అనంతరం నిందితురాలు సునీత తన భర్తకు గుండెపోటు (Heart Attack) వచ్చి చనిపోయాడని ఇంటి యజమానికి, పోలీసులకు చెప్పి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు మొదట దీనిని సాధారణ మృతిగా భావించినప్పటికీ, పోస్ట్‌మార్టమ్ నివేదికలో బాధితుడి తలపై తీవ్ర గాయాలు, గొంతు పిసికిన ఆధారాలు బయటపడ్డాయి.

అంతేకాకుండా, ఈ దాడి జరుగుతున్న సమయంలో వారి 7 ఏళ్ల కుమారుడు ప్రత్యక్ష సాక్షిగా ఉండటంతో పోలీసులు సునీతను అదుపులోకి తీసుకుని విచారించగా, నిజం ఒప్పుకుంది.

Also Read: Street Food: ఈ స్ట్రీట్ ఫుడ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి