Birthday: పిల్లలకు బర్త్‌డే అంటే చాలా స్పెషల్. ముందుగానే రోజులు లెక్కపెట్టి ఎదురు చూస్తారు. ఆ రోజు అందరూ తమను ప్రత్యేకంగా చూసుకోవడం వాళ్లకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ జనరేషన్‌లో బర్త్‌డే అంటే కేవలం కొత్త డ్రెస్, స్వీట్‌తో సరిపెట్టుకునే పరిస్థితి లేదు. చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని పిల్లలు కోరుకుంటారు. అందుకే తల్లిదండ్రులు కూడా పెద్దగా ప్లాన్ చేసి ఖర్చు చేస్తుంటారు.
అయితే ప్రతి సంవత్సరం ఇలా ఎక్కువ ఖర్చు చేయడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి సమయంలో తక్కువ బడ్జెట్‌లోనే పిల్లల్ని సంతోషపెట్టేలా బర్త్‌డే సెలబ్రేట్ చేయాలంటే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది.
డెకరేషన్ ఇలా చేయండి
బర్త్‌డే అంటే డెకరేషన్ తప్పనిసరి. కానీ దీనికోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. బయట వాళ్లను పెట్టి డెకరేషన్ చేయించకుండా, మీరు ఇంట్లోనే సింపుల్‌గా చేసుకోవచ్చు. కలర్‌ఫుల్ బెలూన్స్, చిన్న లైట్స్, “హ్యాపీ బర్త్‌డే” పోస్టర్లు, రిబ్బన్లు తీసుకుని ఇంటిని అందంగా అలంకరించండి. పిల్లల్ని కూడా ఈ పనిలో భాగస్వామ్యం చేస్తే వాళ్లు ఇంకా ఆనందపడతారు. అలాగే వారి క్రియేటివిటీ కూడా పెరుగుతుంది.
సింపుల్ మెనూ ప్లాన్ చేయండి
ఫుడ్ విషయంలో ఎక్కువ ఐటమ్స్ అవసరం లేదు. సింపుల్‌గా ప్లాన్ చేస్తే సరిపోతుంది. సాండ్‌విచ్‌లు, పాప్‌కార్న్, కప్‌కేక్స్ లాంటి స్నాక్స్ పెట్టొచ్చు. ఇవి పిల్లలకు ఇష్టమే. ఇంట్లోనే పిజ్జా లేదా కేక్ తయారు చేస్తే ఖర్చు కూడా తగ్గుతుంది, సరదా కూడా పెరుగుతుంది. ఫ్రూట్స్ లేదా ఫ్రూట్ సలాడ్ కూడా మంచి ఆప్షన్.
పిల్లల కోసం ఫన్ గేమ్స్
బర్త్‌డే రోజున పిల్లలు యాక్టివ్‌గా ఉండేలా చూడాలి. కేక్ కట్ చేసి ముగించకుండా, చిన్న చిన్న గేమ్స్ ప్లాన్ చేయండి. ట్రెజర్ హంట్, మ్యూజికల్ గేమ్స్, డ్రాయింగ్, కలరింగ్ వంటి కార్యక్రమాలు పిల్లలను ఎంగేజ్ చేస్తాయి. పాటలు పెట్టి డ్యాన్స్ చేయించండి. ఇవన్నీ పెద్ద ఖర్చు లేకుండా పార్టీని మరింత ఫన్‌గా మార్చేస్తాయి.
సింపుల్ సర్ప్రైజ్‌లు ఇవ్వండి
పిల్లలకు సర్ప్రైజ్‌లు అంటే చాలా ఇష్టం. ఖరీదైన గిఫ్ట్స్ అవసరం లేదు. వారికి ఇష్టమైన పాటతో పార్టీని ప్రారంభించండి. ఆ పాటను అందరితో పాడించండి. అలాగే పిల్లలకు ఇష్టమైన వ్యక్తిని ముందుగా చెప్పకుండా సర్ప్రైజ్‌గా పిలిస్తే వాళ్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే పెద్ద ఆనందాన్ని ఇస్తాయి.
అవుట్‌డోర్ పార్టీ ప్లాన్ చేయండి
సాధ్యమైతే బర్త్‌డే పార్టీని పార్క్ లేదా గార్డెన్‌లో ప్లాన్ చేయండి. ఇది తక్కువ ఖర్చుతో పాటు పిల్లలకు ఎక్కువ ఎంజాయ్‌మెంట్ ఇస్తుంది. పిక్నిక్‌లా ప్లాన్ చేసి గేమ్స్ ఆడిస్తే మరింత సరదాగా ఉంటుంది. ఇంట్లో స్థలం లేకపోతే ఇది మంచి ప్రత్యామ్నాయం.
ఇలా కొంచెం ప్లానింగ్‌తో తక్కువ ఖర్చులోనే పిల్లల బర్త్‌డేను గ్రాండ్‌గా, గుర్తుండిపోయేలా చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు ఆనందపడటం ముఖ్యం, ఖర్చు కాదు.
