Telangana: జూన్‌ 1 నుంచి ఇంటర్మీడియట్ తరగతులు

Telangana junior colleges to reopen on June 1

Telangana junior colleges to reopen on June 1

Telangana: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను మార్చి 30న విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం జూనియర్ కాలేజీలు జూన్ 1 నుంచి ప్రారంభమవుతాయి. దీంతో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు తరగతులు జూన్ ప్రారంభం నుంచే మొదలవుతాయి. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 224 పని దినాలు ఉండాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎస్ కృష్ణ ఆదిత్య తెలిపారు.

విద్యా కార్యక్రమాల్లో భాగంగా అక్టోబర్ 3 నుంచి 9 వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం అక్టోబర్ 10 నుంచి 21 వరకు దసరా సెలవులు ఉంటాయి. ఈ సెలవుల తర్వాత అక్టోబర్ 22న కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయి. అలాగే సంక్రాంతి సందర్భంగా జనవరి 13 నుంచి 17, 2027 వరకు ఐదు రోజుల సెలవులు ప్రకటించారు. జనవరి 18 నుంచి మళ్లీ కాలేజీలు ప్రారంభమవుతాయి.

సెలవుల అనంతరం జనవరి 18 నుంచి 23 వరకు ప్రీ-ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి చివరి వారంలో జరగనున్నాయి. ఇక పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 2027 చివరి వారంలో ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

మార్చి 27, 2027ను ఈ విద్యా సంవత్సరానికి చివరి పని దినంగా నిర్ణయించారు. అనంతరం విద్యార్థులకు మార్చి 28 నుంచి మే 30 వరకు వేసవి సెలవులు ఉంటాయి. మే 2027 మూడవ వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. వేసవి సెలవుల తర్వాత మే 31, 2027న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.

ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఈ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అడ్మిషన్లు నిర్వహించాలని కార్యదర్శి ఆదేశించారు. అలాగే ఈ షెడ్యూల్‌తో పాటు ప్రభుత్వ సెలవులు, ప్రతి ఆదివారం సెలవులను కూడా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

Also Read: AC, Induction Cooktop: ఏసీ, ఇండక్షన్ స్టవ్ ఒకేసారి వాడుతున్నారా?

Telangana: జూన్‌ 1 నుంచి ఇంటర్మీడియట్ తరగతులు