Exercise Tips: పిరియడ్స్ టైంలో ఎక్సర్ సైజ్ చేస్తున్నారా..?

Exercising During Your Period: Benefits and Things to Avoid

Exercising During Your Period: Benefits and Things to Avoid

Exercise Tips: ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ జీవితంలో వ్యాయామానికి ముఖ్యమైన స్థానం ఇవ్వాలి. వ్యాయామం చేయడం వల్ల శరీరం ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉంటుంది. తాజా అధ్యయనాల ప్రకారం సాయంత్రం సమయంలో వాకింగ్ లేదా జిమ్ చేయడం మరింత ప్రయోజనకరమని చెబుతున్నాయి. అయితే ఉదయం వ్యాయామం మంచిది కాదనే కాదు, కానీ సాయంత్రం చేయడం వల్ల కొన్ని అదనపు లాభాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

పనివేళల తర్వాత వ్యాయామం చేయడం వల్ల శరీరం ఉల్లాసంగా మారుతుంది. కాబట్టి వ్యాయామం చేయాలనుకునేవారు తమ షెడ్యూల్‌ను సాయంత్రం సమయానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది. అలాగే ఎప్పుడు వ్యాయామం చేయాలి, ఎప్పుడు చేయకూడదో తెలుసుకోవడం కూడా చాలా అవసరం.

మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదిగా భావిస్తున్నారు. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల చెమట ఎక్కువగా వస్తుంది, దీంతో శరీరంలోని మలినాలు బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది.

ఉదయం కూడా వ్యాయామం చేయవచ్చు. ముఖ్యంగా ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య వ్యాయామం చేస్తే శరీరం యాక్టివ్‌గా ఉండి, మెటబాలిజం సజావుగా పనిచేస్తుంది.

జలుబు ఉన్నప్పుడు వ్యాయామం చేయకూడదని చాలామంది అనుకుంటారు. కానీ తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

మహిళలు రుతుక్రమం సమయంలో కూడా వ్యాయామం చేయవచ్చు. ఇది పొట్టలో వచ్చే నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

శరీరం అలసిపోయినప్పుడు కూడా వ్యాయామం చేయడం మంచిదే. కనీసం 30 నిమిషాల వ్యాయామం చేస్తే రక్త ప్రసరణ మెరుగై, ఆక్సిజన్ స్థాయిలు పెరిగి అలసట తగ్గి ఉత్సాహం పెరుగుతుంది.

అయితే కొన్ని పరిస్థితుల్లో వ్యాయామం చేయకపోవడం మంచిది. కండరాల్లో నొప్పి లేదా వాపు ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయడం మంచిది కాదు. ఇది జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

కాబట్టి మీ శరీర పరిస్థితిని బట్టి సరైన సమయాన్ని ఎంచుకుని వ్యాయామం చేయడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చు.

Also Read: IPL 2026: క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే.. ఐపీఎల్‌ మ్యాచ్‌లు లైవ్ ఎక్కడ చూడొచ్చంటే..

Exercise Tips: పిరియడ్స్ టైంలో ఎక్సర్ సైజ్ చేస్తున్నారా..?