April Bank Holidays: ఏప్రిల్‌ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు!

Bank Holidays in April 2026: Check the complete list here

Bank Holidays in April 2026: Check the complete list here

April Bank Holidays: 2026 ఏప్రిల్ నెలలో పండుగలు, వార్షిక ఖాతాల ముగింపు, వారాంతపు సెలవుల కారణంగా బ్యాంకులు చాలా రోజులు పనిచేయవు. కాబట్టి బ్యాంక్‌కు సంబంధించిన పనులు ఉంటే ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం, ఏప్రిల్ 1న ఆర్థిక సంవత్సర ముగింపు సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి. ఇది తప్పనిసరి సెలవుదినం. అలాగే రామనవమి, గుడ్ ఫ్రైడే వంటి పండుగల కారణంగా కూడా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.

ఏప్రిల్ నెలలో ముఖ్యమైన బ్యాంకు సెలవులు ఇవీ:

  • ఏప్రిల్ 1 (బుధవారం): ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
  • ఏప్రిల్ 2 (గురువారం): మౌండీ థర్స్‌డే సందర్భంగా కొచ్చి, తిరువనంతపురంలో సెలవు.
  • ఏప్రిల్ 3 (శుక్రవారం): గుడ్ ఫ్రైడే సందర్భంగా ఎక్కువ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
  • ఏప్రిల్ 14 (మంగళవారం): అంబేద్కర్ జయంతి, తమిళ నూతన సంవత్సరం, బైసాఖీ సందర్భంగా పలు రాష్ట్రాల్లో సెలవు.
  • ఏప్రిల్ 15 (బుధవారం): బెంగాలీ నూతన సంవత్సరం, హిమాచల్ దివస్ సందర్భంగా కోల్‌కతా, అగర్తల, గువహటి, షిమ్లా, కొచ్చి వంటి నగరాల్లో సెలవు.
  • ఏప్రిల్ 16 (గురువారం): బొహాగ్ బిహు సందర్భంగా గువహటిలో బ్యాంకులు మూసి ఉంటాయి.
  • ఏప్రిల్ 20 (సోమవారం): బసవ జయంతి / అక్షయ తృతీయ సందర్భంగా బెంగళూరు సహా కొన్ని రాష్ట్రాల్లో సెలవు.
  • ఏప్రిల్ 21 (మంగళవారం): గారియా పూజ సందర్భంగా అగర్తలలో సెలవు.

వీటికి తోడు వారాంతపు సెలవులు కూడా ఉంటాయి:

  • ఆదివారాలు: ఏప్రిల్ 5, 12, 19, 26
  • రెండవ శనివారం: ఏప్రిల్ 11
  • నాలుగవ శనివారం: ఏప్రిల్ 25

బ్యాంక్ బ్రాంచ్‌లు మూసి ఉన్నప్పటికీ, ఖాతాదారులకు డిజిటల్ సేవలు అందుబాటులో ఉంటాయి. UPI (GPay, PhonePe), ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు. నగదు కోసం ATM సేవలు కూడా ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయి.

అందువల్ల బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉంటే, పై సెలవులను దృష్టిలో ఉంచుకుని ముందుగానే మీ పనులను ప్లాన్ చేసుకోవడం మంచిది.

Also Read: Virosh Buddymoon: రష్మిక-విజయ్ వెకేషన్.. విల్లా ధర ఒక్క రాత్రికి రూ.2.60 లక్షలు

April Bank Holidays: ఏప్రిల్‌ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు!