Ram Charan: రామ్ చరణ్‌కు స్వల్ప గాయం అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ (Peddi) సినిమా షూటింగ్ సమయంలో ఈ ఘటన జరిగిందని సమాచారం. ముఖ్యంగా ఆయన కంటి దగ్గర చిన్న గాయం అయినట్లు చెబుతున్నారు. అయితే ఇది పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం కాదని, స్వల్ప గాయమేనని అభిమానులను నమ్మబలికే పోస్టులు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
చరణ్ రెండు రోజులు విశ్రాంతి తీసుకుని మళ్లీ షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఆయనకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఒక ప్రత్యేక గీతాన్ని కూడా షూట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27న ఒక టీజర్ విడుదల చేసే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.
ఇక ‘పెద్ది’ సినిమా విషయానికి వస్తే, ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా రూపొందుతోంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మొదట ఈ సినిమా మార్చి 27న విడుదల కావాల్సి ఉండగా, తర్వాత ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఆ తేదీన కూడా సినిమా విడుదల కావడం అనుమానంగా ఉందని వార్తలు వస్తున్నాయి.
Also Read: LPG Shortage: కొత్త రూల్.. వారు 35 రోజుల వరకు గ్యాస్ బుక్ చేయొద్దు
Ram Charan: ‘పెద్ది’ షూటింగ్ లో రామ్ చరణ్ కు గాయం
