Andhra: హ్యాట్సాఫ్ అమ్మా.. చంకలో చంటిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్

Woman Constable Clears Traffic While Carrying Baby Boy At Kakinada

Woman Constable Clears Traffic While Carrying Baby Boy At Kakinada

Andhra: శాంతిభద్రతలను కాపాడటంలో, ప్రజలకు సహాయం చేయడంలో పోలీసులు చేసే కృషి అందరికీ తెలిసిందే. విధుల్లో ఉన్నపుడు చాలా సందర్భాల్లో వారు ప్రాణాలనే పణంగా పెడతారు. అలాంటి ఉదాహరణే తాజాగా కాకినాడలో చోటు చేసుకుంది.

ఓ మహిళా కానిస్టేబుల్ ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్సును బయటకు తీశి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆమెకు ఆ సమయంలో అధికారికంగా ఏ విధులూ అప్పగించకపోయినా, పరిస్థితిని గమనించగానే ముందుకు వచ్చి బాధ్యత తీసుకున్నారు.

సమాచారం ప్రకారం, శనివారం సీఎం పర్యటన సందర్భంగా రంగంపేట పోలీస్ స్టేష‌న్కు చెందిన కానిస్టేబుల్ ఆముదాల జయశాంతికి కాకినాడలో డ్యూటీ వేశారు. ఆమె తన బిడ్డను బంధువుల ఇంట్లో ఉంచి విధులకు హాజరయ్యారు. పర్యటన ముగిశాక స్వగ్రామం వెళ్లేందుకు బయలుదేరిన ఆమె కాకినాడ–సామర్లకోట రోడ్డులో తీవ్రమైన ట్రాఫిక్‌ను గమనించారు.

ట్రాఫిక్ జామ్ కారణంగా అంబులెన్స్ కూడా ముందుకు సాగలేకపోతుండటాన్ని చూసి ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తన బిడ్డను చంకలోనే పట్టుకుని రోడ్డుపైకి వెళ్లి స్వయంగా ట్రాఫిక్ క్లియర్ చేశారు. దీంతో అంబులెన్స్‌కు దారి కలిగింది.

ఈ ఘటనను చూసిన ప్రయాణికులు ఆమె సేవాభావాన్ని అభినందించారు. కొందరు మొబైల్‌తో వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఒకవైపు తల్లిగా తన బాధ్యతను, మరోవైపు కానిస్టేబుల్‌గా కర్తవ్యాన్ని నిర్వర్తించడంతో ప్రజలు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

చాలామంది ఆమెను రాణి రుద్రమదేవిని గుర్తు చేసుకుంటూ, “లోకల్ మోడ్రన్ రుద్రమ” అని అభివర్ణిస్తున్నారు.

Also Read: Pregnancy: బిడ్డ కదలికలు ఎప్పుడు చెక్ చేయాలంటే?

Andhra: హ్యాట్సాఫ్ అమ్మా.. చంకలో చంటిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్