D Mart: రిటైల్ మార్కెట్లో DMartకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండటంతో అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ షాపింగ్ చేయడానికి ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా శనివారం, ఆదివారం రోజుల్లో DMart స్టోర్లలో భారీ రద్దీ కనిపిస్తుంది. సాధారణంగా ఇక్కడ వస్తువులు ఇతర మార్కెట్లతో పోలిస్తే తక్కువ ధరలకు లభిస్తాయి. అయితే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే ఇంకా తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువులు కొనుగోలు చేయవచ్చు.
ఆఫర్ల సమయంలో షాపింగ్ చేయండి
DMart లో సెలవు దినాలు లేదా పండుగల సమయంలో ఎక్కువ ఆఫర్లు ఉంటాయి. సంక్రాంతి, క్రిస్మస్, నూతన సంవత్సరం వంటి సందర్భాల్లో బై వన్ గెట్ వన్, 50% డిస్కౌంట్ వంటి ఆఫర్లు కనిపిస్తాయి. ఈ సమయంలో అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తే మంచి లాభం ఉంటుంది.
ధరల లేబుల్‌లను తప్పక చూడండి
DMart కు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న ధరల బోర్డులు, లేబుల్‌లను జాగ్రత్తగా చదవాలి. ఎంత శాతం తగ్గింపు ఉందో తెలుసుకోవాలి. చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోకుండా కొనుగోలు చేస్తారు. కానీ లేబుల్‌లను సరిగ్గా పరిశీలిస్తే తక్కువ ధరలో మంచి ఉత్పత్తులను ఎంపిక చేసుకోవచ్చు.
అన్ని విభాగాలు పరిశీలించండి
DMart అంటే కేవలం కిరాణా సరుకులు మాత్రమే కాదు. ఇక్కడ ఎలక్ట్రానిక్స్, వంట సామాగ్రి, గృహ అవసరాల వస్తువులు కూడా తక్కువ ధరలకు లభిస్తాయి. అందుకే మాల్ మొత్తం తిరిగి చూసి ఎక్కడ మంచి ఆఫర్లు ఉన్నాయో తెలుసుకుని కొనుగోలు చేయడం మంచిది.
షాపింగ్‌కు సమయం కేటాయించండి
DMart లో త్వరగా షాపింగ్ పూర్తయ్యే అవకాశం ఉండదు. డిస్కౌంట్లు, ఆఫర్లు ఏమున్నాయో తెలుసుకోవాలంటే కనీసం ఒకటి నుంచి రెండు గంటలు సమయం కేటాయించడం మంచిది. తొందరపడి షాపింగ్ చేస్తే మంచి ఆఫర్లను మిస్ అయ్యే అవకాశం ఉంటుంది.
రద్దీ సమయాన్ని తప్పించండి
ప్రతి నెలా 10వ తేదీకి ముందు DMart కు వెళ్లడం మంచిది కాదు. ఆ సమయంలో చాలా మందికి జీతాలు వచ్చి ఉంటాయి కాబట్టి స్టోర్‌లో భారీ రద్దీ ఉంటుంది. అందరూ నెలవారీ సరుకుల కోసం వస్తారు. ఆ రద్దీలో ఆఫర్లు, డిస్కౌంట్లను సరిగా చూడటం కూడా కష్టమవుతుంది.
ఈ చిన్న చిట్కాలను పాటిస్తే DMart లో తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువులు కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది. 🛒
Also Read: Smart Phone: మీ ఫోన్ ఈ సెట్టింగ్ ఆన్‌లో ఉంటే.. ఛార్జింగ్ ఇట్టే అయిపోతుంది
D Mart: ఈ టైంలో డీ మార్ట్ కి అస్సలు వెళ్లకండి
