World

Pakistan: మతపరమైన హింసలో 18 మంది మృతి

Pakistan: 18 killed in sectarian violence in Khyber Pakhtunkhwa

Image Source : AP

Pakistan: గత 24 గంటల్లో వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్‌ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన మతఘర్షణల్లో దాదాపు 18 మంది మృతి చెందగా, 30 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్యాసింజర్ వ్యాన్‌ల కాన్వాయ్‌పై గురువారం జరిగిన దాడిలో ఉగ్రవాదులు 47 మందిని చంపిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని కుర్రం జిల్లాలో అలీజాయ్, బగన్ తెగల మధ్య ఘర్షణలు జరిగాయి. బలిష్‌ఖేల్, ఖార్ కాలీ, కుంజ్ అలీజాయ్, మక్బాల్‌లలో కూడా కాల్పులు కొనసాగుతున్నాయి.

భారీ, ఆటోమేటిక్ ఆయుధాలతో గిరిజనులు పరస్పరం టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 18 మంది మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. ఈ ఘర్షణల్లో 30 మందికి పైగా మరణించినట్లు స్వతంత్ర, మీడియా వర్గాలు నివేదించాయి. ఈ ఘర్షణలో ఇళ్లు, దుకాణాలు కూడా దెబ్బతిన్నాయి. వివిధ గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.

పరిస్థితి దిగజారుతున్నందున, జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు ఈ రోజు మూసివేయబడి ఉన్నాయని ప్రైవేట్ ఎడ్యుకేషన్ నెట్‌వర్క్ చైర్మన్ ముహమ్మద్ హయత్ హసన్ ధృవీకరించారు.

Also Read : Wayanad Bypoll: 3 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక గాంధీ

Pakistan: మతపరమైన హింసలో 18 మంది మృతి