Rains: దంచికొడుతున్న వానలు.. 100 మందికి పైగా మృతి

Floods kill more than 100 across southern Africa as rains intensify

Floods kill more than 100 across southern Africa as rains intensify

Rains: ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో భారీ వర్షాలు ప్రమాదాలను సృష్టిస్తున్నాయి. మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండగా, ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులై ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో వర్షాలు ఇంకా తీవ్రంగా ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఆందోళనలు మరింత పెరిగాయి.

మొజాంబిక్‌లో వరదలు, వర్షాల కారణంగా 2 లక్షల మందికి పైగా ప్రభావితులయ్యారు. వేల సంఖ్యలో ఇళ్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. జింబాబ్వేలో పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. అక్కడ వర్షాల కారణంగా 70 మంది మృతి చెందగా, 1,000కి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. పాఠశాలలు, వంతెనలు, రోడ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Torrential rains, floods kill over 100 across southern Africa

దక్షిణాఫ్రికాలో మరణాల సంఖ్య 30కు చేరింది. బాధితులను రక్షించేందుకు సహాయక బృందాలు హెలికాప్టర్లతో రక్షణ చర్యలు చేపట్టాయి. వరదల ప్రభావంతో ప్రముఖ క్రుగర్ నేషనల్ పార్క్ కూడా ముంపుకు గురైంది. అందులో చిక్కుకున్న 600 మంది పర్యాటకులు, పార్క్ సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

నిపుణుల ప్రకారం, లా నినా ప్రభావంతో వాతావరణంలో వచ్చిన మార్పులు ఆఫ్రికాలోని ఏడు దేశాల్లో భారీ వర్షాలను తీసుకొచ్చాయని అమెరికా వాతావరణ హెచ్చరికల వ్యవస్థ వెల్లడించింది.

Also Read: Nagoba Jatara: నేటి నుంచి నాగోబా జాతర

Rains: ఆఫ్రికా దేశంలో దంచికొడుతున్న వానలు