Earthquake: భూకంపం జమ్మూ–కశ్మీర్‌ను ఒక్కసారిగా కుదిపేసింది. సోమవారం ఉదయం వచ్చిన ప్రకంపనలు లడ్డాఖ్‌తో పాటు కశ్మీర్ ప్రాంతాల్లో ప్రజలను బెదిరించాయి. భూకంపం సంభవించడంతో ఇళ్లలో, కార్యాలయాల్లో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని సమాచారం.
Earthquake tremors felt in Jammu and Kashmir. https://t.co/JvDujditvy
— AsiaWarZone (@AsiaWarZone) January 19, 2026
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 11:51 గంటల సమయంలో ఈ కంపనం నమోదైంది. భూకంపం కేంద్రం లేహ్ ప్రాంతంగా గుర్తించబడింది. భూకంపం 171 కిలోమీటర్ల లోతులో ఏర్పడి రిక్టర్ స్కేల్‌పై 5.7 తీవ్రతగా నమోదైంది. ఈ ప్రకంపనలు జమ్ము–కశ్మీర్ ప్రాంతం మొత్తం ప్రభావితం చేశాయి. అనంతరం అధికారులు అప్రమత్తమై ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
హిమాలయ ప్రాంతం భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతంగా పరిగణిస్తారు. ఇదే సమయంలో ఆదివారం అఫ్ఘానిస్తాన్‌లో కూడా 4.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఇవాళ వచ్చిన ప్రకంపనలు తాత్కాలికంగానే ఉన్నప్పటికీ ఆఫ్టర్‌షాక్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
