Typhoon Yagi : గత వారం టైఫూన్ యాగీ, కాలానుగుణ రుతుపవనాల వర్షాల కారణంగా మయన్మార్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 226 మంది ప్రాణాలు కోల్పోయారని, 77 మంది తప్పిపోయారని ప్రభుత్వ మీడియా నివేదించింది. కొత్త గణాంకాలు తుఫాను కారణంగా ఆగ్నేయాసియాలో మరణించిన వారి సంఖ్య 500 దాటింది.
బాధిత ప్రాంతాలతో కమ్యూనికేషన్ ఇబ్బందుల కారణంగా ప్రాణనష్టాల లెక్కింపు నెమ్మదిగా ఉంది. ఆంగ్ సాన్ సూకీ ఎన్నికైన ప్రభుత్వం నుండి సైన్యం అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత 2021లో ప్రారంభమైన అంతర్యుద్ధంతో మయన్మార్ విధ్వంసమైంది. స్వతంత్ర విశే్లషకులు పాలక మిలిటరీ దేశ భూభాగంలో సగానికి పైగా నియంత్రిస్తుందని నమ్ముతున్నారు.
టైఫూన్ యాగీ
టైఫూన్ యాగీ అంతకుముందు వియత్నాం, ఉత్తర థాయ్‌లాండ్, లావోస్‌లను తాకింది. వియత్నాంలో దాదాపు 300 మంది, థాయ్‌లాండ్‌లో 42 మంది, లావోస్‌లో నలుగురు మరణించారని ఆసియాన్ కోఆర్డినేటింగ్ సెంటర్ ఫర్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ తెలిపింది. ఫిలిప్పీన్స్‌లో 21 మంది మరణించారని, మరో 26 మంది గల్లంతయ్యారని పేర్కొంది.