– దాల్చిన చెక్క పొడిని చీమల పుట్టలు లేదా అవి ఇంట్లోకి వచ్చే ద్వారాల దగ్గర చల్లండి. – దీని బలమైన సువాసన చీమల నావిగేషన్ శక్తిని దెబ్బతీస్తుంది, దాంతో అవి ఇంట్లోకి రావు.
నీటిలో కొద్దిగా మిరియాల పొడి (Black Pepper) కలిపి చీమలు ఉన్నచోట స్ప్రే చేయండి. కారమైన ఈ ఘాటుకి చీమలు ఆ ప్రాంతం నుంచి వెంటనే జారుకుంటాయి.
తిన్న ఆహార పదార్థాలు, చక్కెర సిరప్‌లు కింద పడకుండా వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. తడి లేకుండా చూసుకుంటే చీమల బెడద సగానికి పైగా తగ్గుతుంది!