Virat Kohli: భారత క్రికెట్ అభిమానులకు సంతోషకరమైన వార్త. స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి దాదాపు నాలుగు నెలల తర్వాత భారత్‌కు తిరిగి వచ్చారు. IPL సీజన్‌లో విజయం సాధించిన తర్వాత, కోహ్లి జూన్‌లో తన కుటుంబంతో కలిసి లండన్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. అప్పటి నుంచి విదేశాల్లోనే ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ భారత్ నేలపైకి అడుగుపెట్టారు.
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వద్ద ఆయనను అభిమానులు గుర్తించి స్వాగతం పలికారు. ఆయన ఎయిర్‌పోర్ట్ నుండి బయటకు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన కొత్త లుక్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “కోహ్లి లుక్ అదిరిపోయింది”, “కింగ్ ఈజ్ బ్యాక్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక క్రికెట్ విషయానికొస్తే, కోహ్లి రాబోయే ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసం టీమిండియాతో కలిసి రేపే ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. ఈ నెల 19న తొలి వన్డే మ్యాచ్ జరగనుంది.
కోహ్లి రీ-ఎంట్రీతో జట్టులో కొత్త ఉత్సాహం నెలకొంది. అభిమానులు ఆయన ఫామ్ తిరిగి రావాలని, ఆస్ట్రేలియాపై తన అద్భుతమైన బ్యాటింగ్‌తో మరోసారి మ్యాజిక్ చూపించాలని ఆశిస్తున్నారు. నాలుగు నెలల గ్యాప్ తర్వాత కోహ్లి దేశంలో కనిపించడం అభిమానులకు నిజంగా ఒక ఫెస్టివల్ ఫీలింగ్‌నే ఇచ్చింది.
