Wedding Entry : ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ సందర్భంగా వధూవరులు తమ పెళ్లిరోజును ప్రత్యేకంగా మార్చుకునేందుకు రకరకాల ట్రిక్స్‌ని ట్రై చేస్తున్నారు. ఈ రోజుల్లో, స్టేజ్ ఎంట్రీకి సంబంధించి అనేక విభిన్న పోకడలు వాడుకలో ఉన్నాయి. పూలదండలతో వేదికపైకి రావడం పాత పద్దతి. ఇప్పుడు అంతా మారిపోయింది. అందులో భాగంగా వెరైటీగా ఆలోచించిన ఓ జంట మెషిన్ గన్‌తో స్టేజీ పైకి వచ్చి అందర్నీ ఆశ్చర్యపర్చారు. దీనికి ఇన్సిపిరేషన్ మరేంటో కాదు.. ఈ మధ్య బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీనే.
ఇందులో మెషిన్ గన్ ఎంట్రీతో హీరో బాక్సాఫీస్ ను షేక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. క్లైమాక్స్ సన్నివేశంలో, అతను డజన్ల కొద్దీ మెషిన్ గన్‌లను అమర్చిన బైక్‌ను నడుపుతాడు. అదే తరహాలో బైక్ ప్రతిరూపాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ఒకే ఒక్క తేడా ఏమిటంటే అది సినిమాలో వాడారు. కానీ ఇక్కడ పెళ్లిలో వాడారు. ఇందులో ఈ జంట ఈ వాహనంలోకి ప్రవేశించడం కనిపిస్తుంది. ఈ సమయంలో యానిమల్ సినిమాలోని ‘అర్జన్ వాయిలీ’ పాట బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతోంది.
View this post on Instagram
ఈ వీడియోలో, జంట మెషిన్ గన్లు అమర్చిన కారులో ప్రవేశించి కూర్చున్నట్లు మీరు చూడగలరు. సోషల్ మీడియా యూజర్లు అమ్మాయిని చూసి ఆశ్చర్యపోతున్నారు.
వీడియో వైరల్
ఈ వీడియోకు 1 కోటి కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అయితే చాలా మంది వ్యక్తులు తమ స్పందనలను కామెంట్ చేయడం ద్వారా అందించారు. ఒకరు ఇలా రాశారు, “ఏమిటి!!! ప్రతీకారం/అధికారం కోసం మనుషులను చంపే పాత్రగా ఎందుకు మారతున్నారు” అని మరొకరు రాశారు, “ఆమె తన జీవితంలో తదుపరి యుద్ధానికి సిద్ధమవుతోంది” అని ఒకరన్నారు.