Video: సూపర్ క్యాచ్ పట్టిన శ్రేయస్ అయ్యర్.. తీవ్ర గాయం

Video: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్ సూపర్ క్యాచ్ అందుకున్నారు. హర్షిత్ రాణా వేసిన బంతిని అలెక్స్ కేరీ గాల్లోకి ఆడగా.. శ్రేయస్ వెనక్కి పరిగెడుతూ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నారు. అయితే ఈ క్రమంలో కిందపడి నొప్పితో విలవిల్లాడారు. దీంతో మైదానాన్ని వీడారు. ప్రస్తుతం ఆసీస్ 34 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. సిరాజ్, రాణా, అక్షర్, సుందర్ తలో వికెట్ తీశారు.

Also Read: StarLink: హైదరాబాద్ లో స్టార్ లింక్ ఎర్త్ స్టేషన్?

Video: సూపర్ క్యాచ్ పట్టిన శ్రేయస్ అయ్యర్.. తీవ్ర గాయం