Viral: 70 ఏళ్ల వయసులో తొలి వ్లాగ్.. 3 కోట్ల వ్యూస్

'Samay Vyateet Karne Ke Liye': UP 'Dada Ji', 70, Drops First Vlog; Wins Jay Bhanushali's Praise, 21M Views In A Day

'Samay Vyateet Karne Ke Liye': UP 'Dada Ji', 70, Drops First Vlog; Wins Jay Bhanushali's Praise, 21M Views In A Day

Viral: కొత్త విషయాలు నేర్చుకోవడంలో వయసు అడ్డంకి కాదనే విషయాన్ని ఆధారాలతో నిరూపించాడు ఓ 70ఏళ్ల తాతయ్య. పదవీ విరమణ తర్వాత కాలక్షేపం కోసం సోషల్ మీడియాను ఎంచుకొని, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి ప్రయత్నంగానే అప్లోడ్ చేసిన తొలి వ్లాగ్ రెండు రోజుల్లోనే వైరల్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ వీడియోకు దాదాపు 3 కోట్లకు పైగా వ్యూస్ రావడం విశేషం.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినోద్ కుమార్ శర్మ (70) ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో తన మొదటి వ్లాగ్‌ను పోస్ట్ చేశారు. అందులో తన గురించి స్వయంగా పరిచయం చేస్తూ, వ్లాగింగ్‌లో ఎలాంటి అనుభవం లేదని, రిటైర్మెంట్ తర్వాత సమయాన్ని ఉపయోగించుకోవడానికి దీనిని ప్రారంభించినట్లు చెప్పారు. వీడియో నచ్చితే ప్రజలు ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.

ఇదిలా ఉండగా, ఆయన వీడియో సోషల్ మీడియా అంతటా ట్రెండింగ్ అయ్యింది. కేవలం రెండు రోజుల్లోనే ఆ వీడియోకు 2 మిలియన్లకు పైగా లైక్స్ రావడంతో పాటు వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. వినోద్ శర్మను ప్రోత్సహిస్తూ నెటిజన్లు మంచి మాటలతో ముందుకు వచ్చారు.

“వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే… మేము మీతో ఉన్నాము” అని ఒకరు కామెంట్ చేయగా, “అంకుల్ జీ, మీరు దీన్ని కొనసాగించండి… కొత్తగా నేర్చుకోవడానికి వయసు అనేది అడ్డంకి కాదని మీరు నిరూపించారు” అని మరొకరు రాశారు.

ఇంతకే ఆగిపోకుండా ఈ వీడియో బాలీవుడ్ ప్రముఖులు అనుపమ్ ఖేర్, జై భానుశాలిల దృష్టికి కూడా వెళ్లింది. వారు కూడా శర్మను అభినందిస్తూ కామెంట్లు పెట్టారు. తొలి వ్లాగ్ వైరల్ అయ్యాక, వినోద్ శర్మ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా 64,000 మార్క్ దాటింది.

Also Read: PhonePe: ఫోన్ పే ఉంటే చాలు.. రూ. 5 లక్షల లోన్

Viral: 70 ఏళ్ల వయసులో తొలి వ్లాగ్.. 3 కోట్ల వ్యూస్