Viral Video: నటి చెంప పగలగొట్టిన నటుడు.. వీడియో వైరల్

Raghav Juyal's slap to Sakshi Malik goes viral; truth behind it revealed

Raghav Juyal's slap to Sakshi Malik goes viral; truth behind it revealed

Viral Video: ఒక నటుడు, నటి మధ్య జరిగిన సంఘటన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఆ వీడియోలో నటుడు రాఘవ్ జుయల్, నటి సాక్షి మాలిక్‌పై చెంపదెబ్బ కొట్టడం కనిపించడంతో చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. నిజంగా వీరి మధ్య ఏం జరిగింది? ఎందుకు ఇలా గొడవ పడ్డారు? అని అందరూ తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారు.

sdf

వీడియోలో రాఘవ్ జుయల్, సాక్షి మాలిక్ మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఆ క్రమంలో సాక్షి, రాఘవ్ జుట్టును కోపంగా లాగుతుంది. వెంటనే రాఘవ్ కూడా సాక్షికి చెంపదెబ్బ కొడతాడు. అక్కడ ఉన్న స్నేహితులు వారిని ఆపడానికి ప్రయత్నించినా, గొడవ బిగ్గరగా సాగుతున్నట్లు కనిపించడంతో చాలామంది దీనిని నిజమైన గొడవగా భావించారు.

అయితే, ఈ వీడియోపై ఉన్న అనుమానాలను వీరు స్వయంగా తొలగించారు. రాఘవ్, సాక్షి ఇద్దరూ స్పష్టం చేస్తూ – ఇది నిజమైన గొడవ కాదని, ఒక సినిమా సన్నివేశానికి రిహార్సల్ మాత్రమేనని తెలిపారు. రాఘవ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా ఇదే విషయాన్ని రాసి – “ఇది యాక్టింగ్ రిహార్సల్ బ్రదర్, నిజం కాదు” అని పేర్కొన్నారు.

రాఘవ్ జుయల్ పేరు వినగానే అతని కామెడీ టైమింగ్, డ్యాన్స్ స్టైల్ గుర్తుకు వస్తాయి. ABCD, స్ట్రీట్ డాన్సర్ 3D, సల్మాన్ ఖాన్ సినిమా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ వంటి చిత్రాల్లో తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

Also Read: Varalakshmi Vratham: వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి.. కావాల్సిన వస్తువులు

Viral Video: నటి చెంప పగలగొట్టిన నటుడు.. వీడియో వైరల్