Viral Video : తండ్రులు పిల్లలపై తమ భావాలను, భావోద్వేగాలను చాలా అరుదుగా చూపించగలరు. అయితే, తన కుమార్తె తన కోసం మొదటిసారి వంట చేసిన తర్వాత తండ్రి ప్రతిచర్యను చూపించే వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను రీతూ దాస్‌గుప్తా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. దీనిలో ఆమె వండిన ఆహారంపై తన అభిప్రాయాన్ని పంచుకోమని తన తండ్రిని కోరింది.
View this post on Instagram
దాస్‌గుప్తా షేర్ చేసిన వీడియోకు 2.3 మిలియన్లకు పైగా వ్యూస్, దాదాపు 2లక్షల 27వేల లైక్‌లు వచ్చాయి. వీడియోలో, కుమార్తె తన తండ్రిని, “పాపా, మీ కోసం మొదటిసారి వంట చేశాను. అది ఎలా ఉందో చెప్పండి?”. తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, తండ్రి ఇలా అన్నాడు, “బేటా, నా ఈ జీవితం విజయవంతమైంది. ఇది రుచికరమైన ఆహారం, తల్లి అన్నపూర్ణా దేవియే స్వర్గం నుండి దిగి వచ్చి వండినట్టు అనిపిస్తుంది”. అతని రియాక్షన్‌తో గదిలో ఉన్నవారంతా నవ్వుతున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.