Allu Arjun: థియేటర్లకు 2 లారీల పేపర్లు తీసుకెళ్లండి: అల్లు అర్జున్

Allu Arjun Shares Video on Nagarjuna's Shiva Movie re-release

Allu Arjun Shares Video on Nagarjuna's Shiva Movie re-release

Allu Arjun: 1989లో కింగ్ నాగార్జున హీరోగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో విడుదలైన ‘శివ’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. ఆ కాలంలో కథ, సంగీతం, టెక్నికల్ వర్క్, మెనరిజమ్స్ అన్నీ కొత్తదనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా అప్పటి యువతలో పెద్ద క్రేజ్ సృష్టించింది. ఇప్పుడు అదే చిత్రాన్ని కొత్త తరం ప్రేక్షకులు పెద్ద తెరపై మళ్లీ అనుభవించేందుకు రీరిలీజ్ చేయనున్నారు. నవంబర్ 14న ఈ సినిమా ప్రత్యేక రీరిలీజ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఇందులో ఆయన, “మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక క్లాసిక్ సినిమాను మళ్లీ థియేటర్లలో సెలబ్రేట్ చేసుకునే సమయం వచ్చింది. ‘శివ’ సినిమా ఓ ట్రెండ్ సెట్ చేసిన మూవీ. అక్కినేని అభిమానులు మాత్రమే కాదు, తెలుగు సినిమా ప్రేమికులందరూ ఈ సినిమా కోసం థియేటర్లకు వెళ్లాలి. అదికూడా ఖాళీగా కాదు… థియేటర్లకు రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండి, సెలబ్రేషన్ స్థాయిలో ఎంజాయ్ చేయండి” అని అన్నారు. అంటే ఆయన ఉద్దేశం – సినిమా రీరిలీజ్ ను పండగలా జరుపుకోవాలని సూచించడం.

అల్లు అర్జున్ ఇచ్చిన ఈ ప్రేమపూర్వక, జోష్ ఉన్న శుభాకాంక్షలకు నాగార్జున స్పందించారు. ఆయన, “డియర్ అల్లు అర్జున్… మీకు రెండు లారీల థ్యాంక్స్!” అంటూ సరదాగా, ప్రేమగా వ్యాఖ్యానిస్తూ వీడియోను షేర్ చేశారు.

ఈ రీరిలీజ్ తో పాత జ్ఞాపకాలు తిరిగి రానున్నాయి. అలాగే కొత్త తరం ప్రేక్షకులూ ‘శివ’ సినిమాని పెద్ద తెరపై చూసే అవకాశాన్ని పొందబోతున్నారు. Telugu Film Industry లో ఒకప్పుడు ఎలా కొత్త ట్రెండ్ మొదలైందో చూసే అవకాశం ఇది.

Also Read: Video: సూపర్ క్యాచ్ పట్టిన శ్రేయస్ అయ్యర్.. తీవ్ర గాయం

Allu Arjun: థియేటర్లకు 2 లారీల పేపర్లు తీసుకెళ్లండి: అల్లు అర్జున్