వరంగల్ నగరంలో ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షం కారణంగా అండర్ బ్రిడ్జి కింద భారీగా నీరు చేరింది. ఈ వరద నీటిలో బస్సు చిక్కుకుపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న ఇంతేజార్ గంజ్ ఇన్స్ స్పెక్టర్ షుకూర్, తన సిబ్బందితో కలిసి తాళ్ల సహాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు రప్పించారు.
