Vijay: ఫ్యాన్స్ అత్యుత్సాహం.. కిందపడ్డ స్టార్ హీరో

Oops! thalapathy Vijay fell down the stairs

Oops! thalapathy Vijay fell down the stairs

Vijay: తమిళ సినీ పరిశ్రమలో దళపతి విజయ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా కోట్లాది అభిమానుల మనసులు గెలుచుకున్న విజయ్ (Thalapathy Vijay), తన చివరి సినిమాగా ప్రకటించిన **‘జన నాయగన్’**తో మరోసారి రికార్డు స్థాయి హైప్‌ను సృష్టిస్తున్నారు. దీనికి తాజాగా జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్‌నే నిదర్శనంగా చెప్పొచ్చు.

డిసెంబర్ 27న మలేషియాలోని కౌలాలంపూర్ బుకిట్ జలీల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ నిజంగా ఓ సినిమా పండుగను తలపించింది. ఓపెన్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష మంది అభిమానులు హాజరయ్యారు. భారీ స్టేజ్ సెటప్, అంతర్జాతీయ స్థాయి లైటింగ్, సౌండ్ డిజైన్ ఈ ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అత్యధిక ప్రేక్షకులు పాల్గొన్న ఆడియో లాంచ్‌గా ఈ కార్యక్రమం మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. శ్రీలంక తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద తమిళ ప్రవాసుల జనాభా మలేషియాలో ఉండటం విశేషం.

ఇదిలా ఉండగా, మలేషియా నుంచి చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు విజయ్ చేరుకున్న సమయంలో భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అభిమానులు ఒక్కసారిగా ఆయనను చుట్టుముట్టడంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో కారు ఎక్కుతుండగా విజయ్ ఒక్కసారిగా జారి పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనలో విజయ్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

విజయ్‌కు ఉన్న అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను చూసి మరోసారి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ‘జన నాయగన్’తో తన సినీ ప్రయాణానికి ముగింపు పలకబోతున్న విజయ్, ఈ సినిమాతోనే కాదు, తన అభిమానుల ప్రేమతో కూడా చరిత్ర సృష్టిస్తున్నారని చెప్పొచ్చు.

Also Read: Viral: భార్య సూసైడ్.. వెయ్యి కిలోమీటర్లు పారిపోయి..

Vijay: ఫ్యాన్స్ అత్యుత్సాహం.. కిందపడ్డ స్టార్ హీరో